Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Sabarimala: శబరిమలలో ఆంక్షలు.. కేరళ ప్రభుత్వంపై హిందూ సంఘాల ఆగ్రహం

    శబరిమల పై కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కోవిడ్ నిబంధనల పేరిట ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    news18
    Updated: October 13, 2020, 1:36 PM IST
    Sabarimala: శబరిమలలో ఆంక్షలు.. కేరళ ప్రభుత్వంపై హిందూ సంఘాల ఆగ్రహం
    శబరిమల ఆలయం(ఫైల్ ఫొటో)
    • News18
    • Last Updated: October 13, 2020, 1:36 PM IST
    • Share this:
    కేరళలో త్వరలో మొదలుకాబోయే శబరిమల యాత్రకు సంబంధించి ఆ రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి వామపక్ష ప్రభుత్వం యాత్రపై పలు ఆంక్షలు విధించింది. పవిత్ర పంబ నదిలో స్నానాలు చేయడం, నెయ్యి అభిషేకాలను నిషేధించింది. 41 రోజుల పాటు నిష్టగా మాల ధరించి.. ఘోర తపస్సులా ఆచారాలను ఆచరిస్తూ.. మాల విరమణకు శబరిమాలకు వచ్చే భక్తులు పంపా నదిలో స్నానం చేసి.. నెయ్యి అభిషేకం చేయడం తీర్థయాత్రలో అత్యంత కీలకమని హిందూ సంఘాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం వీటిపైనే నిషేధం విధించడం.. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆ సంఘాల నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.

    ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఆచరణాత్మకమైనవి కావని అంతేగాక భక్తుల్లో గందరగోళం సృష్టించే విధంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అవసరమైతే.. యాత్రను పూర్తిగా రద్దు చేయాలి గానీ ఆలయ పవిత్రతను మంటగలపకూడదని అంటున్నారు. రెండు నెలల పాటు సాగే ఈ తీర్థయాత్ర నవంబర్ 16న ప్రారంభమవుతుంది. కాగా, ప్రభుత్వం బ్యూరోక్రాట్లను మాత్రమే పిలిచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని హిందూత్వ సంఘాలు, పూజారులు ఆరోపిస్తున్నారు. దీనిపై త్వరలోనే హైకోర్టుకు వెళ్లాలని వారు యోచిస్తున్నారు.

    ఇదే విషయమై శనివారం పలువురు ప్రధాన పూజారులు, ఆలయ సంఘాలు, హిందూత్వ సంస్థలు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఈ సమావేశానికి స్వామి చిదానందపురి అధ్యక్షత వహించారు. అయితే దీనిపై శబరిమల తంత్రి కందారు రాజీవరు అభిప్రాయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలని ఆయన తెలిపారు.  ఇతర మతాలకు సంబంధించిన పండుగలు, వేడుకలలో మాత్రం వారి మతగురువులను, మత పెద్దలను సంప్రదించిన అక్కడి లెఫ్ట్ ప్రభుత్వం.. హిందూ దేవాలయాల విషయానికి వచ్చేసరికి మాత్రం అలా వ్యవహరించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమే గాక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క హిందూత్వ వ్యతిరేక విధానం అని శబరిమల యాక్షన్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.జె.ఆర్ కుమార్ అన్నారు.  కాగా, ఇదే విషయం మీద పలు హిందూత్వ సంస్థలు, ఆలయ పూజారులు ఇప్పటికే గవర్నర్ కు, ముఖ్యమంత్రికి మెమోరాండం సమర్పించారు.

    ఇదిలాఉంటే.. పండలం రాజకుటుంబం, ట్రావెన్స్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మాత్రం.. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయమై పండలం రాజకుటుంబ ప్రతినిధి శశికుమార్ వర్మ మాట్లాడుతూ.. కోవిడ్ ఆంక్షలకు కట్టుబడి తీర్థయాత్రను చేపట్టే ప్రభుత్వ నిర్ణయానికి అంగీకారం తెలిపినట్టు చెప్పారు.
    Published by: Srinivas Munigala
    First published: October 13, 2020, 1:36 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading