హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirmala Sitharaman: హిందీ మాట్లాడాలంటే వణుకు పుడుతుంది.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Nirmala Sitharaman: హిందీ మాట్లాడాలంటే వణుకు పుడుతుంది.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

నిర్మల సీతారామన్

నిర్మల సీతారామన్

Nirmala Sitharaman: చిన్నతనంలో కొత్త భాష నేర్చుకోవడం ఈజీ అని.. కొనీ ఒక వయసు వచ్చాక కొత్త భాష నేర్చుకోవడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. అయిత్తే తన భర్త మాతృ భాష తెలుగును సులువగా నేర్చుకోగలిగానని ఆమె చెప్పారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ (Hindi) మాట్లాడాలంటే తనకు వణుకు అని అన్నారు. హిందీలో మాట్లాడాల్సి వస్తే.. సంకోచిస్తూనే మాట్లాడుతుంటానని చెప్పారు. ముంబైలో ఓ హిందీ మేగజైన్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల సీతారామన్ హిందీలో మాట్లాడతారని వ్యాఖ్యాత పేర్కొనడంతో.. ఈమె ఈ విధంగా స్పందించారు. హిందీ అంటే ఎందుకు భయమో.. హిందీ విషయంలో సంకోచానికి దారితీసిన పరిస్థితులేంటో వివరించారు. హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగిన తమిళనాడులో తాను పుట్టానని.. అందుకే కాస్త ఇబ్బంది పడతానని ఆమె చెప్పారు.

  “నేను పుట్టింది, పెరిగిందీ అంతా తమిళనాడులోనే. కాలేజీ చదివే రోజుల్లో హిందీ వ్యతిరేక ఉద్యమం బలంగా జరిగింది. అప్పటి ఉద్యమ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను స్వయంగా చూశాను. ఆ రోజుల్లో రెండో లాంగ్వేజ్‌గా హిందీ లేదా సంస్కృతం ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. కానీ మెరిట్‌ వచ్చిన విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు వచ్చేవి కావు. వారు ఎంచుకున్న భాషే అందుకు కారణం. హిందీ మాట్లాడాలంటే సంకోచిస్తాను. అందుకే అంత అనర్గళంగా మాట్లాడలేను'' అని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

   ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులకు కేంద్రం షాక్.. మాకు సంబంధం లేదు..

  చిన్నతనంలో కొత్త భాష నేర్చుకోవడం ఈజీ అని.. కొనీ ఒక వయసు వచ్చాక కొత్త భాష నేర్చుకోవడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. అయిత్తే తన భర్త (పరకాల ప్రభాకర్) మాతృ భాష తెలుగును సులువగా నేర్చుకోగలిగానని ఆమె చెప్పారు. గత అనుభవాల కారణంగా హిందీని మాత్రం అంత వేగంగా నేర్చుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పటికీ సంకోచిస్తూనే హిందీ భాషను మాట్లాడుతుంటానని తెలిపారు. ఐతే హిందీ మాట్లాడాలంటే వణుకు పుడతుందంటూనే.. 35 నిమిషాల పాటు హిందీలోనే నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.

  భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని.. సోషలిజం దిగుమతి చేసుకున్న తత్వశాస్త్రం కారణంగానే మరింత వృద్ధి సాధించలేకపోయిందని నిర్మల సీతారామన్ అభిప్రాయపడ్డారు. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. పూర్తిస్థాయిలో ఆర్థిక వ్యవస్థకు తెరదీయలేదని అన్నారు. అవి సరైన విధానంలో జరగలేదని విమర్శించారు నిర్మల. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఆయన వచ్చిన తర్వాతే మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రస్తుతం మోదీ హయాంలో భారత్ సరైన మార్గంలో వెళ్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hindi, Nirmala sitharaman

  ఉత్తమ కథలు