లోయలో పడ్డ బస్సు...ఏడుగురు దుర్మరణం

news18
Updated: June 9, 2018, 10:13 AM IST
లోయలో పడ్డ బస్సు...ఏడుగురు దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: June 9, 2018, 10:13 AM IST
  • Share this:
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. రాజధాని సిమ్లాకు 40 కిలోమీటర్ల దూరంలో తియాగ్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. హైవే నుంచి 600 నుంచి 700 మీటర్ల కిందకు బస్సు పడిపోయింది. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మ్రుతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని డాక్టర్లు తెలిపారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. అతివేగంతోనే అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కర్ నుంచి సిమ్లా వెళ్తుండగా తియాగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 6:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading