Home /News /national /

HIMACHAL PRADESH RAINS UPDATE 1 DEAD 6 MISSING AS HIMACHAL PRADESH SEES CLOUDBURST FLASH FLOODS LANDSLIDE MKS

Cloudburst | Landslide : కుభవృష్టి, కొండచరియలు విరిగి.. వరదలో కొట్టుకుపోయిన పర్యాటకులు..

పర్యాటక ప్రాంతం కులూలో వరద బీభత్సం

పర్యాటక ప్రాంతం కులూలో వరద బీభత్సం

హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి ప్రకోపం బీభత్సాన్ని సృష్టించింది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కులు జిల్లాలో కుభవృష్టి, భయానక వరద, కొండచరియలు విరిగిపడి టూరిస్టులు గల్లంతయ్యారు. కారుపై బండరాయి పడి ఓ మహిళ దుర్మరణం చెందారు. వివరాలివే..

ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ప్రకృతి ప్రకోపం బీభత్సాన్ని సృష్టించింది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కులు జిల్లాలో కుభవృష్టి (Cloudburst), ఆకస్మిక వరద(Flash Floods), కొండచరియలు విరిగిపడి (Landslide) టూరిస్టులు గల్లంతయ్యారు. కులు జిల్లా ప‌ర్వ‌తి లోయ‌లోని చోజ్ ముల్లా ప్రాంతంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు అక‌స్మాత్తుగా భయానక వర్షం కురిసింది. వరదపోటెత్తి గ్రామాలను ముంచెత్తడంతోపాటు కొడచరియలు విరిగిపడ్డాయి.

కులు జిల్లాలో బుధవారం ఉదయం కుంభవృష్టి కురియగా, పార్వ‌తి న‌దిలో అక‌స్మాత్తుగా వ‌ర‌ద పెర‌గి, స‌మీపంలో ఉన్న పర్యాటక క్యాంపు సైట్ల‌న్నీ కొట్టుకుపోయాయి. వరదలో కొంద‌రు టూరిస్టులు కొట్టుకుపోయినట్లు స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. చోజ్ గ్రామంతో లింకు ఉన్న బ్రిడ్జ్ ధ్వంసం అయ్యింది. న‌ది స‌మీపంలో ఉన్న ఆరు కేఫ్‌లు కూడా వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాయి.


Vastu Expert : ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య.. ఆస్తి కోసం శిష్యులే..


ఒక్క చోజ్ గ్రామంలోనే కనీసం ఆరుగురు పర్యాటకులు వరదలో గల్లంతైనట్లు తెలుస్తోంది. షిమ్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిపడంతో భారీ రాయి వ‌చ్చి కారు మీద ప‌డ‌డంతో.. ఓ మ‌హిళ మృతిచెందింది. ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ద‌ల్లీ ట‌న్నెల్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి షిమ్లాలో ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి.


CM KCR : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ధరణి, భూసమస్యలపై 15 నుంచి రెవెన్యూ సదస్సులు..


భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండంతో ఫిరోజ్‌పూర్‌-షిప్కీ జాతీయ ర‌హ‌దారిని మూసివేశారు. బ్రోనీ నుల్లాలో నీటి ప్ర‌వాహం పెర‌గ‌డంతో హైవేను బ్లాక్ చేశారు. కులు జిల్లాలోని మ‌ల‌నా ప్రాజెక్టు వ‌ద్ద కూడా అక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. ఓ బిల్డింగ్‌లో చిక్కుకున్న 30 మంది ఉద్యోగుల‌ను సుర‌క్షితంగా త‌ర‌లించారు. ఫ్లాష్ ఫ్ల‌డ్స్‌లో వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Heavy Rains, Himachal Pradesh, Landslide, Weather report

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు