హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Himachal Landslide: షాకింగ్ వీడియోలు.. హిమాచల్‌లో కొండచరియల బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు..

Himachal Landslide: షాకింగ్ వీడియోలు.. హిమాచల్‌లో కొండచరియల బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు..

హైవేపై విరిగిపడిన కొండచరియలు (Image:ANI)

హైవేపై విరిగిపడిన కొండచరియలు (Image:ANI)

Himachal Pradesh Landslide: జులై 25న కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా-చిత్కుల్ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఓ పర్యాటకుల వాహనంపై బండరాళ్లు పడడంతో.. అందులో ఉన్న 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు

హిమాచల్‌ప్రదేశ్‌పై ప్రకృతి పగబట్టింది. వరుస ప్రమాదాలు పర్యాటకులతో పాటు స్థానికలనూ వణికిస్తున్నాయి. ముఖ్యంగా కిన్నౌర్ జిల్లాలో కొండ చరియలు విరిగి.. పెద్ద పెద్ద బండరాళ్లు కింద పడుతున్నాయి. అవి రోడ్లపై వెళ్తున్న వెళ్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. తాజాగా కిన్నోర్ జిల్లాలో మళ్లీ కొండ చరియలు విరిగిపడ్డాయి. బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో నిగుల్‌సేరి ప్రాంతంలో NH-5పై ఈ ఘటన జరిగినట్లు ఐటీబీపీ తెలిపింది. ఈగిల్ ఫారెస్ట్ సమీపంలో కొండ చరియలు విరిగిపడినట్లు పేర్కొంది. రోడ్డుపై వెళ్తున్న ఓ హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సుతో పాటు లారీని బలంగా ఢీకొన్నట్లు తెలిపింది. శిథిలాల కింద 40 మంది వరకు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

కొండల పై నుంచి పెద్ద పెద్ద రాళ్లు దూసుకొచ్చి, హైవేపై పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బండరాళ్ల ధాటికి వాహనాలను ధ్వంసంమైన దృశ్యాలను చూస్తూ.. అది ఎంత పెద్ద ప్రమాదమో అర్ధం చేసుకోవచ్చు.

ఘటనా స్థలంలో వెంటనే సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక అధికారయంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ఆర్టీసీ బస్సుతో పాటు ట్రక్కు, పలు కార్లను బండరాళ్లలు ఢీకొట్టినట్లు సమాచారం అందుతోందని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

గత నెలలో భారీ వర్షాల ధాటికి హిమాచల్ ప్రదేశ్‌లో చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. జులై 25న కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా-చిత్కుల్ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఓ పర్యాటకుల వాహనంపై బండరాళ్లు పడడంతో.. అందులో ఉన్న 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. తాజాగా మరోసారి భారీగా కొండ చరియలు విరిగిపడడంతో స్థానికులతో పాటు పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం నిగుల్‌సేరి ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్‌లో ఇద్దరే ఆస్తులు కొన్నారు..ఎందుకిలా? అంచనాలు ఎందుకు తప్పాయి?
First published:

Tags: Himachal Pradesh, Landslide

ఉత్తమ కథలు