Himachal Pradesh Voting : ఇండియాలో మునుగోడు తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో రాజకీయ వేడి రగిల్చిన హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజా తీర్పును వెల్లడించబోతున్నాయి. అతి చల్లదనం కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు 68 ఉండగా... 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 7,881 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు.. 55,07,261 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. ఐతే వీరిలో 1,86,681 మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. వారు ఎవరివైపు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. పోటీ ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ మధ్య ఉంది.
బీజేపీదే అంటున్న సర్వేలు
ఆల్రెడీ అధికారంలో ఉన్న బీజేపీయే మళ్లీ గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. అదే ఉత్సాహంతో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రభావం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనే ఉద్దేశంతో.. కచ్చితంగా మళ్లీ గెలవాలనే ఉద్దేశంతో గట్టిగానే ప్రయత్నించారు. ఐతే.. హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీకీ ప్రజలు వరుసగా రెండోసారి అధికారం ఇవ్వట్లేదు. అందువల్ల ఈసారి తాము గెలిచి తీరతామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. పంజాబ్‌లో అధికారాన్ని దక్కించుకొని జోరుగా ఉన్న ఆప్ .. దేశవ్యాప్తంగా విస్తరించే ప్లాన్‌లో భాగంగా.. హిమాచల్ ప్రదేశ్ పైనా ఫోకస్ పెట్టి బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ ఇతర పార్టీలు కూడా ప్రభావం చూపించాలనుకుంటున్నాయి.
Heart Attack : చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం.. వీరు ఎక్కువ జాగ్రత్త పడాలి
డబ్బే డబ్బు :
ఈసారి ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో 226 మంది కోటీశ్వరులే. మొత్తం అభ్యర్థుల్లో వీరు 55 శాతం ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) బయటపెట్టింది. కోటీశ్వరులైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచే ఉన్నారు. ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్లో 90 శాతం మంది.. అంటే 61 మంది కోటీశ్వరులే. అలాగే.. బీజేపీలో 82 శాతం మంది అంటే 56 మంది సంపన్నులున్నారు. ఇక సామాన్యుల పార్టీగా చెప్పుకునే ఆప్ నుంచి 52 శాతం మంది అంటే.. 35 మంది కోటీశ్వరులున్నారు. అలాగే.. బీఎస్పీ అభ్యర్థుల్లో 25 శాతం మంది అంటే.. 13 మంది కోటీశ్వరులే. సీపీఎం తరపున నలుగురు, స్వతంత్రుల్లో 45 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు.
Chicken Biryani : కుక్కర్‌లో చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే.. ఓ పట్టు పట్టేస్తారు
నేర ఆరోపణలు:
కోటీశ్వర్వులైన అభ్యర్థుల్లో 66 మందిపై క్రిమినల్ నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. వీరిలో ఠియోగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి రాకేశ్ సింఘాపై 30 క్రిమినల్ కేసులున్నాయి. అలాగే సిమ్లా జిల్లా.. కసుంపటి నుంచి పోటీ చేస్తున్న మరో సీపీఎం అభ్యర్థి కులదీప్ సింగ్‌పై 20 కేసులున్నాయి. సిమ్లా గ్రామీణ స్థాన కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 11 క్రిమినల్ కేసులున్నాయి. పార్టీలు మంచి అభ్యర్థుల్ని నిలబెడుతున్నట్లు చెబుతుంటే.. ఈ లెక్కలు అసలు వాస్తవాల్ని బయటపెడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.