హిమాచల్ ప్రదేశ్-2022 అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సంకల్ప్ పాత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను బీజేపీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులు, వాగ్దానాలను మేనిఫెస్టోలో పేర్కొంది. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత ప్రధాన టార్గెట్ ను మేనిఫెస్టోను చూస్తే అర్ధం అవుతుంది.
BJP National President Shri @JPNadda releases 'BJP Sankalp Patra 2022' in Shimla, Himachal Pradesh. #BJPVijaySankalphttps://t.co/QUgMuCegOM
— BJP Himachal Pradesh (@BJP4Himachal) November 6, 2022
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ఇవే..
బీజేపీ మేనిఫెస్టో సంకల్ప్ పాత్ర అని పేరు పెట్టగా మహిళల కోసం స్త్రీ శక్తి సంకల్పం అంటూ పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తాం.
బీపీఎల్ కుటుంబంలో ఆడపిల్లలకు పెళ్ళికి రూ.51 వేలు ఇస్తానని మేనిఫెస్టోలో పేర్కొంది.
తల్లి, నవజాత శిశువుల రక్షణ కోసం మహిళలకు రూ.25 వేలు రూపాయలు అందిస్తామని ప్రకటించింది.
అలాగే విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని పేర్కొంది.
పేద మహిళలకు దేవి అన్నపూర్ణ యోజన నుండి 3 ఉచిత LPG సిలిండర్లు అందిస్తామని పేర్కొంది.
12వ తరగతిలో మొదటి 5 వేల ర్యాంక్ సాధించిన బాలికలకు రూ.25 వేల స్కాలర్ షిప్ అందిస్తామని పేర్కొంది.
30 ఏళ్లు పైబడిన మహిళలను అటల్ పెన్షన్ యోజనలో చేర్చనున్నారు.
12 జిల్లాలకు 2 బాలికల హాస్టళ్లను నిర్మిస్తామని హామీనిచ్చారు.
హిమ్ కేర్ కార్డు కవర్ చేయని వ్యాధుల చికిత్స కోసం మహిళలకు స్త్రీ శక్తి కార్డు అందిస్తామని బీజేపీ హామీనిచ్చింది.
ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..అక్టోబర్ 17వ తేదీన ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుండగా..నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబర్ 27న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 చివరి తేదీ. నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కాగా ఈ ఎన్నికలను ఒకే విడతలోజరపనున్నట్లు ఈసీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లో (Himachal Pradesh) 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Himachal Pradesh Elections 2022, India