హిమాచల్‌లో గిన్నీస్ రికార్డు కిచిడీ...1995 కేజీల భారీ ప్రసాదం..

1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కేలా నిర్వాహకులు ఈ మెగా ప్రయత్నం చేశారు. మొత్తం 25 మంది చెఫ్‌లు కలిసి ఐదు గంటల్లో ఈ కిచిడీని తయారు చేశారు.

news18-telugu
Updated: January 16, 2020, 10:22 AM IST
హిమాచల్‌లో గిన్నీస్ రికార్డు కిచిడీ...1995 కేజీల భారీ ప్రసాదం..
(Image: Twitter)
  • Share this:
హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక అరుదైన వంటకం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అందరి దృష్టిని ఆకర్షించేలా సుమారు 1995 కేజీల కిచిడీని తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కేలా ఒక తంతు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు 55 కిలోమీటర్ల దూరంలోని తట్టపాణి గ్రామంలో నిర్వాహకులు ఈ ఫీట్ సాధించారు. ఇంత పెద్ద పరిమాణంలో వండిన కిచిడీని సట్లెజ్‌ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈ కిచడి ప్రసాదం వడ్డించారు. 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కేలా నిర్వాహకులు ఈ మెగా ప్రయత్నం చేశారు. మొత్తం 25 మంది చెఫ్‌లు కలిసి ఐదు గంటల్లో ఈ కిచిడీని తయారు చేశారు. మొత్తం 450 కిలోల బియ్యం, 190 కిలోల ధాన్యాలు, 90 కిలోల నెయ్యి, 55 కిలోల సుగంధ ద్రవ్యాలు, 1,100 లీటర్ల నీటిని కిచిడీ తయారీలో వినియోగించారు.First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>