Flood Alert: ఈ రాష్ట్రాలకు భారీ వరద ముప్పు.. కేంద్ర జలసంఘం హెచ్చరిక

ఉత్తరాంధ్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాలకు కూడా మోస్తరు వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర జల సంఘం తెలిపింది.

news18-telugu
Updated: August 19, 2020, 2:19 PM IST
Flood Alert: ఈ రాష్ట్రాలకు భారీ వరద ముప్పు.. కేంద్ర జలసంఘం హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది.  ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  నదులు మహోగ్రరూపం దాల్చాయి. జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఐతే ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశా, చత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ సబ్ డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా వరద రావచ్చని కేంద్రం జల సంఘం హెచ్చరించింది. ఆ ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక ఉత్తరాంధ్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాలకు కూడా మోస్తరు వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర జల సంఘం తెలిపింది. ఏపీలో ఇప్పటి గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. స్థానికులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Published by: Shiva Kumar Addula
First published: August 19, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading