Home /News /national /

Lockdown: అలా అయితే మరో ఆరు నుంచి ఎనిమిది వారాల లాక్ డౌన్ తప్పదు.. ఐసీఎంఆర్ హెచ్చరిక

Lockdown: అలా అయితే మరో ఆరు నుంచి ఎనిమిది వారాల లాక్ డౌన్ తప్పదు.. ఐసీఎంఆర్ హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో మరో 6-8 వారాల పాటు లాక్ డౌన్ తప్పదని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) డీజీ బలరామ్ భార్గవ్ తెలిప

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో మరో 6-8 వారాల పాటు లాక్ డౌన్ తప్పదని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) డీజీ బలరామ్ భార్గవ్ తెలిపారు. దేశంలోని 718 జిల్లాల్లో300కు పైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం పైగా ఉంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా 48 శాతంతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, హర్యానా(37%), కర్నాటక ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే పాజిటివిటీ రేటు పెరుగుతోన్నట్లు సమాచారం.

‘పాజిటివిటీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అవసరం. 10 నుంచి 5 శాతానికి పాజిటివిటీ రేటు తగ్గితే ఆయా జిల్లాల్లో ఆంక్షలు సడలించవచ్చు. దేశ రాజధాని దిల్లీల్లో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శాతానికి పడిపోయింది’ అని బలరాం చెప్పారు. ఒకవేళ ఆంక్షలు సడలిస్తే మాత్రం గడ్డు పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. భారత్ లో ప్రస్తుతం రోజుకి 3,50,000 కేసులు, సుమారు 4 వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆంక్షలు సడలిస్తే మరణాలు పదింతలు పెరిగే అవకాశం ఉందన్నారు.

కేంద్రంపై ఆర్థిక భారం పడుతోందన్న భయంతో లాక్ డౌన్ పై పూర్తి అధికారాలను ఆయా రాష్ట్రాలకే వదిలేశారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ చివరి అస్త్రం కావాలని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా నిర్వహించిన ర్యాలీలు, సభల కారణంగా కేసుల శాతం అమాంతం పెరిగిపోయింది. కొత్త రకం వేరియంట్ల కారణంగా కూడా కరోనా వ్యాప్తిలో వేగం పెరిగిందని బలరాం చెప్పారు. యువత కారణంగా వ్యాప్తి వేగంగా జరుగుతోందన్నారు. గత ఏడాది కరోన బారిన పడిన
30 ఏళ్లలోపు యువత శాతం 31 ఉండగా... ఈ ఏడాది అది 32 శాతానికి పెరిగిందన్నారు. కరోనా మహమ్మారిని మాత్రం నియంత్రిచాలంటే 10శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో తప్పనిసరిగా మరో 8 వారాలపాటు మాత్రం లాక్ డౌన్ విధించడం సరైన నిర్ణయమేనని బలరాం స్పష్టం చేశారు.
First published:

Tags: Corona bulletin, Coronavirus, Covid-19, ICMR, Lockdown

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు