హైటెక్ సెక్స్ రాకెట్‌లో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్

హోటల్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్లాన్ రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకోవాలని స్కెచ్ వేశారు. అందుకోసం పోలీసుల విటుల రూపంలో సెక్స్ రాకెట్‌ ముఠాను సంప్రదించారు.

news18-telugu
Updated: January 10, 2020, 5:07 PM IST
హైటెక్ సెక్స్ రాకెట్‌లో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబైలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. పోలీసులు పక్కా స్కెచ్‌తో తామే కస్టమర్లు‌గా మారి సెక్స్ రాకెట్‌ను నడిపిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ఇద్దరు అమ్మాయిలను కాపాడారు. ఈ కేసులో ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో పాటు మరో మోడల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ముంబైలోని గోరేగావ్‌లోని ఓ ఫైవర్ స్టార్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది.

హోటల్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్లాన్ రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకోవాలని స్కెచ్ వేశారు. అందుకోసం పోలీసుల విటుల రూపంలో సెక్స్ రాకెట్‌ ముఠాను సంప్రదించారు. ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. వారు కోరినట్లుగానే నిర్వాహకులు ఇద్దరు అమ్మాయిలను వెంటపెట్టుకొని హోటల్‌కు వెళ్లారు. ఐతే తాము పోలీసులమని చెప్పడంతో సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు షాక్ తిన్నారు. ఈ కేసులో హీరోయిన్ అమృత ధనోవా (32)తో పాటు మోడల్‌ రిచా సింగ్‌ను అరెస్ట్ చేశారు. వారిపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలను పోలీసులు కాపాడి రెస్క్కూ హోంకు తరలించారు.

అరెస్టైన హీరోయిన్ అమృత ధనోవా:First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు