Ayodhya Dispute : సుప్రీం కోర్టులో హైడ్రామా.. న్యాయమూర్తుల అసహనం

Ayodhya Dispute : సుప్రీం కోర్టులో హైడ్రామా.. న్యాయమూర్తుల అసహనం

బాబ్రీ మసీదు, సుప్రీంకోర్టు (File)

హిందూ సంస్థల తరుపు న్యాయవాది ప్రసారన్ మాట్లాడుతూ.. అయోధ్యలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి 55-60 మసీదులు ఉన్నాయని, కానీ హిందువులకు రాముడి జన్మ స్థలమైన మందిరం ఒక్కటే ఉందన్నారు.

  • Share this:
    దశాబ్దాలుగా కోర్టు కేసుల్లో నలుగుతున్న అయోధ్య-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి ఇరు పక్షాలు సుప్రీం ధర్మాసనానికి తమ వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో హిందూ మహాసభ తరుపున వాదిస్తున్న న్యాయవాది 'అయోధ్య రీవిజిటెడ్' అనే పుస్తకాన్ని న్యాయమూర్తికి చూపించారు. అయోధ్య రాముడు పుట్టిన నేల అని చెప్పడానికి
    ఇదే సాక్ష్యం అన్నారు. అయితే సదరు న్యాయవాది వాదనలతో ముస్లిం సంస్థల తరుపు న్యాయవాది రాజీవ్ ధావన్ ఏకీభవించలేదు. దీంతో కోర్టులో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే క్రమంలో రాజీవ్ ధావన్ ఆ పుస్తకాన్ని చించివేయడం ఉద్రిక్తత నెలకొనేలా చేసింది. న్యాయవాదుల తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. ఇలాగే ప్రవర్తిస్తే తాము వెళ్లిపోతామని అసహనం వ్యక్తం చేశారు.

    హిందూ సంస్థల తరుపు న్యాయవాది ప్రసారన్ మాట్లాడుతూ.. అయోధ్యలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి 55-60 మసీదులు ఉన్నాయని, కానీ హిందువులకు రాముడి జన్మ స్థలమైన మందిరం ఒక్కటే ఉందన్నారు. జరిగిందేదో జరిగిందని.. ఈ సాయంత్రం 5గంటలకు తుది తీర్పు వెల్లడిస్తామని సుప్రీం ప్రకటించింది.134ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూ వివాదానికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
    First published: