కారు కలర్స్ కోసం కోర్టుకు.. రవాణాశాఖపై సామాన్యుడి విజయం

రంజిత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. కారును వెంటనే రంజిత్ పేరుపై రిజిస్టర్ చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. భవిష్యత్‌లో ఆయన్ను ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: July 17, 2020, 12:51 PM IST
కారు కలర్స్ కోసం కోర్టుకు.. రవాణాశాఖపై సామాన్యుడి విజయం
కారు కలర్స్ కోసం కోర్టుకు.. రవాణాశాఖపై సామాన్యుడి విజయం
  • Share this:
చండీగఢ్‌కు చెందిన రంజిత్ మల్హోత్రాకు పాత కార్లంటే ప్రాణం. ఇటీవల ఢిల్లీలో ఓ తెలుపు రంగు అంబాసిడర్ కారు కొనుగోలు చేశాడు. దాన్ని తన డ్రీమ్ కారులా మార్చుకునేందుకు ఎన్నో మార్పులు చేశాడు. కారు ఎక్స్టీరియర్‌తో  పాటు ఇంటీరియర్‌ను మార్చేశాడు. అందరిలో భిన్నంగా ఉండేందుకు కారు కలర్‌ని కూడా పూర్తిగా మార్చేశాడు. ఒకే రంగులో కాకుండా విభిన్న రంగుల్లో అందంగా ముస్తాబు చేశాడు. రంగు రంగుల పూల బొమ్మలు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. తనకు నచ్చినట్లుగా పూర్తిగా కారు స్వరూపాన్నే మార్చేశాడు. ఇక అంతా అయిపోయింది.. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందామని అనుకున్నాడు. కానీ అప్పుడే అసలు కష్టాలు మొదలయ్యాయి.


రిజిస్ట్రేషన్ కోసం ఆర్డీఏ ఆఫీసుకు వెళ్లిన రంజిత్‌ మల్హోత్రాకు ఊహించని షాక్ తగిలింది. కారు అసలు రంగు తెలుపు అని.. అలా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కారు విభిన్న రంగుల్లో ఉన్నందున మోటార్ వెహికల్ చట్టం ప్రకారం..రిజిస్ట్రేషన్ చేయలేమని తేల్చిచెప్పారు. రంగులు మార్చేందుకు అనుమతి ఎందుకు తీసుకోలేదని రంజిత్‌ను వేధించారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రంజిత్.. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. దేశంలో వేల కొద్ది లారీలు ఉన్నాయని.. అవన్నీ రంగు రంగుల్లో ఉంటాయని వాదించారు. లారీలకు రంగులు వేసుకునే అవకాశం ఉన్నప్పుడు.. కార్లకు ఎందుకు ఉండదని అన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

దీనిపై విచారించిన హైకోర్టు.. రంజిత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. కారును వెంటనే రంజిత్ పేరుపై రిజిస్టర్ చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. భవిష్యత్‌లో ఆయన్ను ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేసింది. ఐతే హైకోర్టు తీర్పుపై రవాణాశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్ల రంగులు మార్చడం మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని అంటున్నారు. దీనిపై సింగిల్ బెంచ్ తీర్పు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేస్తామని చెప్పారు. మొత్తంగా రవాణశాఖపై రంజిత్ సాధించిన విజయం.. ఇప్పుడు పంజాబ్, హర్యాానాల్లో చర్చనీయాంశమైంది.
Published by: Shiva Kumar Addula
First published: July 17, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading