Home /News /national /

HIGH ALERT IN JAMMU AND KASHMIR BECAUSE TWO DRONES COME ON INDIA LAND NGS

High Alert: భారత్ భూ భాగంలోకి వచ్చిన డ్రోన్లు వారివే..! జమ్మూలో హై అలర్ట్..? ఏం జరుగుతోంది..?

జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్

జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్

భారత భద్రతా దళాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా భారత భూభాగం పైకి వచ్చిన రెండు డ్రోన్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులవే అని భారత భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి. దీంతో జమ్ములో హై అలర్ట్ విధించారు.

  భారత భద్రతా దళాలు మరోసారి అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఊహించని విధంగా భారత భూభాగంలోకి డ్రోన్లు చొచ్చుకు రావడం… అవి కూడా పాకిస్థాన్ వైపు నుంచే  వచ్చాయని నిఘా వర్గాలు అంచనాకు రావడం..  భారత దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి డ్రోన్లను పంపి, ఐఈడీలను జారవిడిచారు. అర్ధరాత్రి తర్వాత రెండు డ్రోన్లు రావడంతో వెంటనే స్పందించిన జవాన్లు వీటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి.. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం దగ్గర డ్రోన్ల సంచరించడం ఆందోళనకు గురి చేస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత.. జమ్ములో హై అలర్ట్‌ ప్రకటించారు. పోలీసులు, జవాన్లు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జమ్ములోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్లకు ముందు రెండు డ్రోన్లు ప్రయాణించిన చప్పుడు వచ్చినట్లు గుర్తించారు. ఒక్కో డ్రోన్‌ 2 కిలోల చొప్పున అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చినట్లు సైన్యం వెల్లడించింది. దాడి తర్వాత అవి సురక్షితంగా వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్నారు. అయితే సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచే వాటిని వినియోగించి ఉండొచ్చని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

  వీటిని ఎక్కడ నుంచి ఎవరు ఆపరేట్ చేశారు అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే లక్కు బాగుండి పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ ఏదో జరుగుతుందనే సంకేతాలు అయితే ప్రత్యర్థులు పంపగలిగారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భద్రతా దళలు అప్రమత్తమయ్యాయి. నిఘాను మరింత పటిష్టం చేశారు...

  ఈ డ్రోన్లు పాకిస్థాన్‌ నుంచి లేదా స్థానిక ఉగ్రవాదుల సాయంతో భారత్‌ నుంచే ఆపరేట్‌ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చీకటి ఉన్న కారణంగానే… లక్ష్యం సరిగా గుర్తించలేకపోయాయని… ప్రమాదం తీవ్రత కూడా తగ్గిందని చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోకి డ్రోన్లు ప్రవేశించడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఫైరయ్యారు. అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నా…భారత భూభాగంలోకి డ్రోన్లు ఎలా వచ్చాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వాయుసేనపై దాడికి యత్నించిన డ్రోన్లు, అమెరికావో లేదంటే చైనా దేశానికి చెందినవో వెంటనే గుర్తించాలన్నారు. మరోసారి శత్రుదేశాలు డ్రోన్ల దాడికి పాల్పడకుండా, చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.

  అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కి.మీ. దూరంలోనే జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచే డ్రోన్‌లు వచ్చి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలించారు. కౌంపౌండ్ వాల్‌పై ఉన్న సీసీ కెమెరాలు రోడ్డు వైపే తిరిగి ఉండడంతో డ్రోన్ల కదలికలు అందులో రికార్డు కానట్లుగా తెలుస్తోంది. డ్రోన్లను రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆపరేట్ చేశారా? లేదంటే జీపీఎస్ ద్వారా నిర్దిష్ట గమ్యానికి పంపించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇవి ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే వచ్చి ఉంటాయని.. దీని వెనక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు.

  ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే జమ్మూలో ఓ వ్యక్తి నుంచి 6 కేజీల ఎల్‌ఈడీ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. అతడికి ఆ డ్రోన్‌లకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్‌ల దాడి ఘటన వెనక ఎవరున్నారో తేల్చేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషనన్‌కు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Drone attack, India news, Jammu and Kashmir

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు