పూర్వకాలంలో రాజులు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, వజ్ర వైడుర్యాలను భూమిలో పాతిపెట్టి దాచిపెట్టేవారు. శత్రువులకు తమ సంపద చిక్కకుండా రహస్య ప్రాంతాల్లో నేలమాళిగల్లో భద్రపరిచేవారు. ఇప్పటికీ పలుచోట్ల బయటపడుతున్న లంకె బిందెలే ఇందుకు నిదర్శనం. రాజుల కాలంలో దాచిపెట్టిన ఆ నిధుల కోసం ఎంతో మంది అన్వేషిస్తున్నారు. చారిత్రక ప్రాంతాలు, ఆలయాల చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమిని తవ్వి గుప్త నిధుల కోసం వెతుకుతున్నారు. నిధుల కోసం గుళ్లను కూడా ధ్వంసం చేసిన ఘటనలను ఎన్నో చూశాం. ఐతే తాజాగా తమిళనాడులో భారీ గుప్త నిధి బయటపడింది. ఏకంగా 2 కేజీల పురాతన బంగారం నాణేలు లభ్యమయ్యాయి.
తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఈ గుప్తనిధులు బయటపడ్డాయి. ఉత్తర్ మేరుర్ కుళంబేశ్వరాలయంలో మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లో తవ్వకాలు జరపడంతో మట్టి పాత్ర లాంటిది కనిపించింది. దాన్ని పగులగొట్టి చూస్తే బంగారం నాణేలు, ఆభరణాలు కనిపించాయి. అక్కడ లభ్యమైన బంగారు 2 కేజీల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఐతే నిధిని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవడం పట్ల ఆలయ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. కుళంబేశ్వరాలయం దేవాదాయశాఖ పరిధిలోలేని.. అందుకే ఆ నిధులు ట్రస్ట్‌కే చెందుతాయని పట్టబట్టింది. ఐతే ఇది పురాతన ఆలయం కావడంతో నిధులను ట్రస్ట్‌కు ఇవ్వడం కుదరదని దేవాదాయశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamilandu