బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. తెరపైకి బడా నిర్మాత పేరు

Bollywood Drugs Case: ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ స్టార్స్‌ను ఎన్సీబీ మరికొన్ని సార్లు ప్రశ్నించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 26, 2020, 3:21 PM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. తెరపైకి బడా నిర్మాత పేరు
ఎన్సీబీ విచారణకు హాజరైన దీపిక, శ్రద్ధా, సారా అలీ ఖాన్
  • Share this:
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఇచ్చిన సమాధానాలు అంతగా సంతృప్తికరంగా లేవని ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో జరుగుతున్న విచారణలో భాగంగా డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్న ఎన్సీబీ ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించింది. ఈ రోజు ఈ కేసు విచారణకు దీపిక పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ హాజరయ్యారు. ఉదయమే ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న దీపిక శ్రద్ధా, సారా అలీ ఖాన్‌లను ఎన్సీబీ విచారిస్తోంది. దీపికకు, కరిష్మా మధ్య చాటింగ్‌పై ప్రశ్నిస్తున్న ఎన్సీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించ దీపిక సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఎన్సీబీ భావిస్తున్నట్టు సమాచారం. ఇక మరో బృందం శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తోంది. జయ సాహాకు మధ్య చాటింగ్‌పై ఎన్సీబీ శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కరిష్మాతో సాధారణ సంబంధాలు తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక పదుకొణె ఎన్సీబీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2019 నాటికి కరోణ్ జోహర్ ఇచ్చిన పార్టీపై ఎన్సీబీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణకు హాజరైన శ్రద్ధా కపూర్ చెప్పడంతో.. ఈ పార్టీలో ఎవరెవరూ పాల్గొన్నారనే దానిపై ఎన్సీబీ ఫోకస్ చేస్తోంది.



అయితే ఈ పార్టీ ఇచ్చినట్టుగా చెబుతున్న బాలీవుడ్ స్టార్ మూవీ మేకర్ కరణ్ జోహర్.. తానెప్పుడూ డ్రగ్స్ సప్లై చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కరణ్ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ మాజీ ఉద్యోగి క్షిత్జీ ప్రసాద్‌ను ఎన్సీబీ ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా కరణ్ జోహర్‌కు సైతం నోటీసులు ఇచ్చే యోచనలో ఎన్సీబీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిన్ననే ఈ కేసుకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. దీపిక, శ్రద్ధా విచారణ ముగిశాక మరోసారి రకుల్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.



మరోవైపు నిన్నటి విచారణ సందర్భంగా ఎన్సీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రకుల్.. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని వారికి వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ స్టార్స్‌ను ఎన్సీబీ మరికొన్ని సార్లు ప్రశ్నించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: September 26, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading