Home /News /national /

HERES ALL YOU NEED TO KNOW ABOUT THE ADVISORY OF PROTECTING EXOTIC ANIMALS AND BETTER CARE TO ZOONOTIC DISEASES GH SRD

Exotic Animals: ఆ జంతువుల విషయంలో మార్గదర్శకాలు అవసరమే.. కేంద్రం అడ్వైజరీకి సుప్రీంకోర్టు సమర్థన

Photo Credit : AFP

Photo Credit : AFP

Exotic Animals: ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి కొత్తరకం, అన్యదేశ జీవ జాతుల దిగుమతి, పొసెషన్ గురించి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) 2020 జూన్‌లో జారీ చేసిన మార్గదర్శకాలను (అడ్వైజరీ నోటిఫికేషన్‌) సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి కొత్తరకం, అన్యదేశ జీవ జాతుల దిగుమతి, పొసెషన్ గురించి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) 2020 జూన్‌లో జారీ చేసిన మార్గదర్శకాలను (అడ్వైజరీ నోటిఫికేషన్‌) సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా సమర్థించింది. 2020 జూన్ 11 నాటి నోటిఫికేషన్ చట్టబద్ధత, చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఇతర ప్రాంతాల నుంచి కొత్త దేశానికి తీసుకువచ్చిన జీవజాతులను ఎగ్జాటిక్ లైవ్ స్పీసిస్ లేదా అన్యదేశాల జీవజాతులు (Exotic live species) అంటారు.

ఈ జంతు, పక్షి జాతులను కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసి కొత్త ప్రదేశానికి తీసుకెళ్లి పెంచుకుంటారు. అయితే కోవిడ్ వ్యాప్తి తర్వాత వన్యప్రాణుల వ్యాపారం, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధులపై (Zoonotic diseases) ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలను వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 2020 జూన్‌లో మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇతర దేశాల నుంచి జంతు, పక్షి జాతుల దిగుమతి అనేది కస్టమ్స్ చట్టం కింద కవర్ అయిప్పటికీ, భారతదేశంలో పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న అన్యదేశ జీవజాతుల సంఖ్యను డాక్యుమెంట్ చేయాలని, ఈ విధానాన్ని నియంత్రించడానికి కఠినమైన చట్టాలు, మార్గదర్శకాలను ఉండాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

* అడ్వైజరీ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

* ఎలాంటి జాతులను అడ్వజరీ నోటిఫికేషన్ కవర్ చేస్తుంది..?
అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యం (CITES)- కన్వెన్షన్ I, II, III అనుబంధాల కింద పేర్కొన్న వన్యప్రాణులు, వృక్షజాలం, జంతువులు అడ్వైజరీ కవరేజీలో ఉన్నాయి. వన్యప్రాణుల (రక్షణ) చట్టం 1972 షెడ్యూల్స్‌లో పేర్కొన్న జాతులు ఇందులో లేవు.

* వాలంటరీ డిస్‌క్లోజ్
MoEFCC పేర్కొన్న అన్యదేశ జంతు జాతులను కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా వాటి వివరాలను వెల్లడించాలి. ఆ జంతువుల స్టాక్, కొత్త సంతానం వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే దిగుమతి, ఎక్స్చేంజ్ వంటి వాటిని కూడా పేర్కొనాలి.

* ఆరు నెలల విండో
అడ్వైజరీ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఈ వివరాలను డిక్లేర్ చేస్తే.. అన్యదేశ జీవ జాతులకు సంబంధించి డిక్లరర్ ఎటువంటి డాక్యుమెంటేషన్‌ను రూపొందించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత డిక్లరేషన్ చేస్తే.. డిక్లరర్ ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం డాక్యుమెంటేషన్ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

* దీని ఉపయోగం ఏంటి?
ఈ డేటాబేస్ కొత్తరకం జీవజాతుల గురించి సమగ్ర వివరాలను అందిస్తుంది. సరైన పశువైద్య సంరక్షణ, నివాసం, జంతు లేదా పక్షి జాతుల శ్రేయస్సు, ఇతర అంశాలపై హోల్డర్‌లకు మార్గనిర్దేశం చేస్తుంది. జంతువులు, మానవుల భద్రతను నిర్ధారించడానికి, జూనోటిక్ వ్యాధుల నియంత్రణ, నిర్వహణలో కూడా ఈ డేటాబేస్ సహాయపడుతుంది.

* ఇది ఎలా పని చేస్తుంది?
డిక్లరేషన్ తర్వాత రాష్ట్రం లేదా UTకి సంబంధించిన చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (CWLW) జీవజాతులను భౌతికంగా చూసి ధ్రువీకరించాలి. వాటి స్టాక్‌ను నమోదు చేసి, ఆఫీస్‌లో రికార్డును మెయింటెన్ చేయాలి. వీరు హోల్డర్‌కు ఆన్‌లైన్ పొసెషన్ (కస్టడీ) సర్టిఫికేట్‌ను జారీ చేస్తారు. ఎగ్జాటిక్ జీవజాతుల గుర్తింపు విషయంలో CWLW లేదా అధీకృత అధికారులకు పూర్తి అధికారాలు ఉంటాయి. డిక్లరేషన్ తర్వాత ఏదైనా అక్వజిషన్/డెత్/ ట్రేడ్/ పొసెషన్ మార్పులు వంటివి జరిగితే.. CWLWకి 30 రోజులలోపు ఆ వివరాలను తెలియజేయాలి.

* సజీవ జంతువు దిగుమతి రూల్స్..?
సజీవంగా ఉండే అన్యదేశ జంతువును దిగుమతి చేసుకోవడానికి నిబంధనల ప్రకారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)కి లైసెన్స్ మంజూరు కోసం దరఖాస్తును సమర్పించాలి. దిగుమతిదారు దరఖాస్తుతో పాటు రాష్ట్ర ప్రధాన వన్యప్రాణి వార్డెన్ అందించే నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ను కూడా జతచేయాలి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Animals, Central Government, National News, Supreme Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు