కేంద్రం విద్యుత్ చట్టంలో ఏముంది?, స్మార్ట్ మీటర్‌తో లాభమా? నష్టమా?

ప్రతీకాత్మక చిత్రం

ఇప్ప‌టి నుంచి కొత్త క‌నెక్ష‌న్ తీసుకోవాల‌నుకునేవారు స్మార్ట్ మీట‌ర్ లేదా ప్రీపెయిడ్ మీటర్లను క‌చ్చితంగా అమ‌ర్చుకోవాలి. లేదంటే విద్యుత్ కనెక్షన్ ఇవ్వ‌రు.

  • Share this:
విద్యుత్ రంగంలో సంస్క‌ర‌ణ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిసారించింది. వినియోగ‌దారులంద‌రికీ నాణ్య‌మైన‌ విద్యుత్ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా కొత్త నియమ నిబంధ‌న‌లను రూపొందిస్తోంది. ఇందుకు సాధారణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ‌స్తున్న‌ సూచనలను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని విద్యుత్ శాఖ చెబుతోంది. వినియోగ‌దారుల హ‌క్కుల బిల్లు-2020లో ఈ నియ‌మాలు ఉన్నాయి.

స్మార్ట్ మీట‌ర్ పెట్టుకుంటేనే కొత్త క‌నెక్ష‌న్‌

ఇప్ప‌టి నుంచి కొత్త క‌నెక్ష‌న్ తీసుకోవాల‌నుకునేవారు స్మార్ట్ మీట‌ర్ లేదా ప్రీపెయిడ్ మీటర్లను క‌చ్చితంగా అమ‌ర్చుకోవాలి. లేదంటే విద్యుత్ కనెక్షన్ ఇవ్వ‌రు. వినియోగ‌దారులు స్మార్ట్ లేదా ప్రీపెయిడ్ మీటర్‌ను సొంతంగా అమ‌ర్చుకోవ‌చ్చు. లేదా సంబంధిత‌ డిస్క‌మ్ నుంచి పొందవచ్చు. డిస్క‌మ్ నుంచే మీటర్ తీసుకోవాల‌నే నిబంధ‌న‌లేమీ విధించ‌రు. విద్యుత్ బిల్లుకు సంబంధించి వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే పంపిణీ సంస్థ(డిస్కమ్)ల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

బిల్లులు నేరుగా చూసుకోవ‌చ్చు

వినియోగదారుడే నేరుగా విద్యుత్తు వినియోగానికి స‌బంధించిన వివ‌రాలు అందించి బిల్లు ఎంత వ‌చ్చిందో తెలుసుకునే అవ‌కాశాన్ని కొత్త‌గా క‌ల్పించ‌నున్నారు. ఇప్ప‌టి నుంచి ప్రొవిజ‌న‌ల్ ఎలక్ట్రిసిటీ  బిల్లులు ఇచ్చే అధికారం డిస్క‌మ్‌ల‌కు ఉండ‌దు. అత్యవసర పరిస్థితుల్లో మాత్ర‌మే, అది కూడా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండు సార్లే డిస్క‌మ్‌లు ప్రొవిజిన‌ల్ బిల్లులు పంపొచ్చు. క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు డిస్క‌మ్‌లు థింక్ బిల్లుల‌ను జారీ చేశాయి.

వెయ్యి దాటితే ఆన్‌లైన్‌లోనే

ఒక‌వేళ వినియోగ‌దారుడికి 60 రోజుల త‌రువాత క‌రెంటు బిల్లు పంపితే, బిల్లు చెల్లించే స‌మ‌యంలో రెండు నుంచి ఐదు శాతం డిస్కౌంటు ఇస్తారు. విద్యుత్ బిల్లుల‌ను డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు. వెయ్యి రూపాయ‌లు దాటిన బిల్లుల‌ను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. మీట‌ర్లు మార్చుకోవ‌డం, బిల్లులు చెల్లించ‌డం, ఫిర్యాదుల ప‌రిష్కారం వంటి వాటిని వినియోగ‌దారులకు సుల‌భ‌త‌రం చేసేలా కొత్త నియ‌మాలు రూపొందించారు.

టోల్ ఫ్రీ నంబ‌రు, యాప్ ద్వారా సేవ‌లు

సేవల్లో లోపాలుంటే పంపిణీ సంస్థ‌ల‌కు జ‌రినామా విధిస్తారు. కొత్త విద్యుత్ క‌నెక్ష‌న్ తీసుకోవ‌డం, ఇప్ప‌టికే ఉన్న క‌నెక్ష‌న్‌ను తొల‌గించడం, క‌నెక్ష‌న్‌ను ఒకరి పేరు నుంచి మ‌రొక‌రి పేరుకు మార్చుకోవ‌డం వంటి సేవ‌ల‌కు ఒక టోల్‌ఫ్రీ నంబ‌రును అందుబాటులోకి తెచ్చారు. వినియోగ‌దారుల‌కు మ‌రిన్ని సేవ‌లందించ‌డానికి ఒక యాప్‌ను కూడా రూపొందించారు. క‌నెక్ష‌న్ తీసుకోవ‌డం, బిల్లులు చెల్లించ‌డం, ఫిర్యాదులు వంటివి యాప్ నుంచే చేసుకోవ‌చ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published: