మహారాష్ట్రలో పాలను నేలపాలు చేస్తున్న రైతులు... వైరల్ వీడియో...

మనం పాలను బోలెడంత రేటు పెట్టి కొనుక్కుంటాం. లీటర్ పాల ధర రూ.2 పెరిగితే అమ్మో అంటాం. మరి పాల రైతులకు ఏం కష్టమొచ్చింది? ఎందుకు పాలను పారబోస్తున్నారు?

advertorial
Updated: July 21, 2020, 1:09 PM IST
మహారాష్ట్రలో పాలను నేలపాలు చేస్తున్న రైతులు... వైరల్ వీడియో...
మహారాష్ట్రలో పాలను నేలపాలు చేస్తున్న రైతులు... వైరల్ వీడియో...(credit - twitter)
  • Share this:
కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో... కొంత మంది పాల రైతులు... పాల ట్యాంకర్ నుంచి పాలను రోడ్డుపై పారబోస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎందుకు అలా చేస్తున్నారు? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. వాళ్లంతా... స్వాభిమానీ షేత్కారీ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు. సంగ్లీ రోడ్డుపై పాలను పారబోశారు. వాళ్లు ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టారు. వాటిలో పాల కనీస ధర లీటరుకు రూ.25 ఉండాలన్నది ప్రధానమైన డిమాండ్. పశ్చిమ మహారాష్ట్రలోని సంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో రైతులు మంగళవారం నుంచి ధర్నా మొదలుపెట్టారు. కరోనా కారణంగా తరచూ లాక్‌డౌన్లు పెడుతుండటంతో తమకు చాలా కష్టంగా ఉంటోందనీ... అందుకే పాల ధర పెంచాలని వాళ్లు కోరుతున్నారు.
డిమాండ్లు నెరవేరకపోతే... ధర్నాలను మరింత పెంచాలన్నది ఆ సంస్థ తాజా ప్లాన్‌గా తెలుస్తోంది. తమ ధర్నాలో భాగంగా రైతులు ఏం చేస్తున్నారంటే... పుణె-బెంగళూరు హైవేపై... మహారాష్ట్ర నుంచి పాలను తీసుకెళ్తున్న ట్యాంకర్లను అడ్డుకుంటున్నారు. పాలను పారబోసి... ఖాళీ ట్యాంకర్‌ను పంపిస్తున్నారు. తాము రూ.5 మాత్రమే పెంచమంటున్నామనీ... ధర పెంచాక... ప్రతి లీటర్ పాల అమ్మకానికీ సంబంధించిన డబ్బు ఆయా పాల రైతుల అకౌంట్లలో డైరెక్టుగా జమ కావాలని రైతులు అంటున్నారు. పాల ఉత్పత్తులపై GSTని ఎత్తివేయాలని కోరుతున్నారు.

దీనిపై ఇంకా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ... రైతులు ఇలా చెయ్యడం సరికాదనీ... దీనివల్ల నష్టపోయేది రైతులేనని నేతలు అంటున్నారు. మొత్తంగా రైతులు చేస్తున్న ధర్నా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాలరైతులతో ప్రభుత్వం చర్చించాలని ప్రజలు కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 21, 2020, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading