ప్రధాని మోదీ స్పీచ్‌లో ‘ఉన్నావ్’ పేరు... దాని వెనుక కథ...

Garib Kalyan Rojgar Abhiyan | సొంతూళ్లకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్రం రూ.50,000 కోట్లతో గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకాన్ని తీసుకొచ్చింది.

news18-telugu
Updated: June 20, 2020, 8:54 PM IST
ప్రధాని మోదీ స్పీచ్‌లో ‘ఉన్నావ్’ పేరు... దాని వెనుక కథ...
ప్రధానమంత్రి మోదీ (credit - twitter - ANI)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ మోదీ ఈ రోజు గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తాముపనిచేస్తున్న ప్రాంతాల్లో ఉపాధి దొరకక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చేసిన కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50,000 కోట్లతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఓ స్కూల్ గురించి ప్రస్తావించారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్న కూలీలు తమ తమ గ్రామాలకు వచ్చేశారు. అలా వచ్చిన వారిలో ఉన్నావ్ జిల్లా వారు కూడా ఉన్నారు. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం అలా వెనక్కి వచ్చిన వారిని స్థానికంగా ఓ స్కూల్లో క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడ గదులు ఉన్నాయి. గ్రౌండ్ కూడా ఉంది. కానీ, అవి ఏ మాత్రం బాగోలేదు. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వలస కూలీలు ఆ స్కూల్ దీన స్థితి చూసి దాన్ని బాగు చేయాలని నిర్ణయించారు. తమకు తెలిసిన పనిని చేశారు. కొందరు పెయింటర్లు, మరికొందరు వడ్రంగి పని చేసేవారు.. ఇలా ఎవరికి వారు తమకు తోచిన పని చేసి ఆ స్కూల్ రంగు, రూపు మార్చారు. అందుకే ప్రధాని మోదీ దానికి గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ పథకం ద్వారా సుమారు 25,000 మందికి లబ్ధి జరుగుతుందని గతంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామన్నారు. 25 భిన్న రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి లభించనుంది.
First published: June 20, 2020, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading