HOME »NEWS »NATIONAL »here is the full list of india public holidays in 2021 ba

Holidays in 2021: 2021లో సెలవులే సెలవులు.. పండుగ చేస్కోండి

Holidays in 2021: 2021లో సెలవులే సెలవులు.. పండుగ చేస్కోండి
Holidays 2021: 2021 సంవత్సరంలో సెలవులు (ప్రతీకాత్మక చిత్రం)

Holidays list for 2021 ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే క్యాలెండర్. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి కొన్ని అదనపు సెలవులు కూడా ఉంటాయి.

  • Share this:
    కొత్త సంవత్సరం వస్తుందంటే, అందరూ మొదటగా వెతికేది క్యాలెండర్ కోసం. ఎవరు ఫ్రీ క్యాలెండర్ ఇస్తారు? ఏ షాపులో బట్టలు కొంటే క్యాలెండర్ వస్తుంది? పేపర్ వాళ్లు ఈ సారి క్యాలెండర్ ఇస్తారా? లేదా? అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యాలెండర్ చేతికి అందగానే, ప్రతి నెలలో ఏమేం సెలవులు ఉన్నాయనేది చెక్ చేసుకుంటారు. ఏ పండుగలు ఏ నెలలో వచ్చాయి? ఏ తేదీల్లో వచ్చాయి? అందులో శని, ఆదివారాల్లో ఏమైనా పండుగలు వచ్చాయా? మన పుట్టిన రోజు ఏ వారం వచ్చింది? వారం మధ్యలో వచ్చిందా? వారంతాల్లో వచ్చిందా? అని చాలా మంది క్యాలెండర్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే, ఇంకా క్యాలెండర్ రావడానికి కొంత సమయం ఉంది. అయితే, మీకు ముందుగానే 2021వ సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ హాలీడేస్ లిస్టును అందిస్తోంది న్యూస్‌18 తెలుగు. ఓ రకంగా 2020 మొత్తం ‘హాలిడే’ లాగానే గడిచిపోయింది కాబట్టి, 2021లో ఎలా ఉందో చూడండి. ఈ పండుగలు చెక్ చేసి, అవి మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లాంగ్ వీకెండ్స్ ఏమైనా వస్తే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి.












































































































































    నెల తేదీ హాలిడే ఎందుకు?
    జనవరి 1 కొత్త సంవత్సరం ఆరంభం
    జనవరి 14 మకర సంక్రాంతి
    జనవరి 26 రిపబ్లిక్ డే
    మార్చి 11 మహా శివరాత్రి
    మార్చి 29 హోలీ
    ఏప్రిల్ 2 గుడ్ ఫ్రైడే
    ఏప్రిల్ 13 గుడి పడ్వా / ఉగాది
    ఏప్రిల్ 21 శ్రీరామ నవమి
    ఏప్రిల్ 25 మహావీర్ జయంతి
    మే 1` కార్మిక దినోత్సవం
    మే 13 ఈద్ ఉల్ ఫితర్
    మే 26 బుద్ధ పూర్ణిమ
    జూలై 12 రథయాత్ర
    జూలై 20 బక్రీద్
    ఆగస్టు 10 మొహర్రం
    ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం
    ఆగస్టు 21 ఓనం
    ఆగస్టు 22 రక్షాబంధన్
    ఆగస్టు 30 శ్రీకృష్ణ జన్మాష్టమి
    సెప్టెంబర్ 10 వినాయకచవితి
    అక్టోబర్ 2 గాంధీ జయంతి
    అక్టోబర్ 15 దసరా
    నవంబర్ 4 దీపావళి
    నవంబర్ 19 మిలాద్ ఉన్ నబీ
    నవంబర్ 19 గురు పూరబ్
    డిసెంబర్ 25 క్రిస్మస్

    ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే క్యాలెండర్. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి కొన్ని అదనపు సెలవులు కూడా ఉంటాయి. అలాగే, అంబేద్కర్ జయంతి, జ్యోతిరావు పూలే జయంతి, చిల్డ్రన్స్ డే (జవహర్ లాల్ నెహ్రూ జయంతి) వంటి సందర్భాలు అదనంగా ఉంటాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:December 02, 2020, 21:42 IST