Home /News /national /

HERE FULL DETAILS ABOUT ISROS NEW SSLV LIKE IMPORTANCE AND USES GH SRD

ISRO's New SSLV: ఇస్రో కొత్త SSLV ప్రత్యేకత ఏంటి? ఇది ఎందుకు కీలకమో తెలుసుకోండి..

ISRO's New SSLV

ISRO's New SSLV

విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(NSIL) భావిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తరకం SSLV(స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్‌)కు ఎందుకు ప్రాధాన్యం ఏర్పడింది..? వీటి ప్రత్యేకత ఏంటి..? వంటి విషయాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఈరోజుల్లో చాలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ అవసరాలను తీర్చుకునేందుకు శాటిలైట్‌(Satellite)లను వినియోగిస్తున్నాయి. ఈ మార్కెట్‌కు ఇటీవల కాలంలో డిమాండ్‌ పెరిగింది. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్‌లో వాటా కోసం చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది. ఇస్రోకు చెందిన SSLV, PSLV, GSLV-MkIIIతో అనేక విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(NSIL) భావిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తరకం SSLV(స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్‌)కు ఎందుకు ప్రాధాన్యం ఏర్పడింది..? వీటి ప్రత్యేకత ఏంటి..? వంటి విషయాలు తెలుసుకుందాం.

* ప్రైవేటు సంస్థల అవసరాలు తీర్చే శాటిలైట్స్‌
ఇటీవలి సంవత్సరాలలో చిన్న ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని భూమి కక్ష్యలలోకి ప్రవేశపెట్టే మార్కెట్ పెరిగింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కార్పొరేషన్ల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతోంది. SSLV ఈ మార్కెట్‌ అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తర్వాత, ఇస్రోకి చెందిన మూడో లాంచింగ్‌ వెహికల్‌ SSLV.

* అతిచిన్న లాంచింగ్‌ వెహికల్‌ SSLV
కేవలం 110 టన్నుల బరువు కలిగిన SSLV ఇస్రో అతి చిన్న లాంచింగ్‌ వెహికల్‌(Smallest Launch Vehicle). ఇతర లాంచింగ్‌ వెహికల్స్‌ 70-రోజుల వ్యవధి మాదిరిగా కాకుండా, ఇది ఇంటిగ్రేట్‌ కావడానికి 72 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇది 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని భూ కక్ష్యకు తీసుకువెళ్లగలదు. ప్రస్తుతం ఇస్రో ఎక్కువ ఆధారపడుతున్న PSLVకి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

ఇది 1,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలదు. SSLV మల్టిపుల్‌ ఆర్బిటల్‌ డ్రాపాఫ్‌లను కూడా చేయగలదు. ఒక లాంచింగ్‌లో మల్టిపుల్‌ మైక్రోసాటిలైట్‌లను ప్రయోగించడానికి అవకాశం కల్పిస్తుంది. తక్కువ ధర, టర్న్‌-అరౌండ్ సమయం, లాంచ్-ఆన్-డిమాండ్ సామర్థ్యం, మినిమల్‌ లాంచ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మల్టిపుల్‌ శాటిలైట్స్‌(Multipul Satellites)ను ఉంచే సామర్థ్యం వంటి బెస్ట్‌ ఫీచర్‌లు ఉన్నాయి.

* తక్కువ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ప్రయోగాలు
SSLV మల్టిపుల్‌ ఆర్బిటల్‌ డ్రాప్-ఆఫ్‌లకు కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఒకే సమయంలో మైక్రోశాటిలైట్‌ల ప్రయోగానికి కచ్చితంగా సరిపోతుంది. కొత్త SSLV ముఖ్య ఫీచర్లలో.. తక్కువ ధర, తక్కువ టర్న్‌-అరౌండ్ సమయం, మల్టిపుల్‌ శాటిలైట్‌లను ప్రయోగించే సౌలభ్యం, లాంచ్-ఆన్-డిమాండ్ ఫీజిబిలిటీ, మినిమల్‌ లాంచ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటివి ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ఏ ఆధారం లేదు.. జామ్‌నగర్ జూకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

SSLVని గురించి ప్రస్తావిస్తూ ఇస్రో మాజీ ఛైర్మన్ కె శివన్ 2019లో ఇలా అన్నారు..‘60 మందికి బదులుగా ఆరుగురు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. మొత్తం పనులు అతి తక్కువ సమయంలో పూర్తవుతాయి. దీని ఖర్చు దాదాపు రూ.30 కోట్లు మాత్రమే. ఇది ఆన్-డిమాండ్ వెహికల్ అవుతుంది.’ అని చెప్పారు. మరోవైపు, SSLV D1 సెట్‌బ్యాక్‌ కాదని, అంతరిక్ష సంస్థ మరోసారి ప్రయత్నిస్తుందని స్పేస్ కమిషన్ సభ్యుడు ఏఎస్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: ISRO, National News, Tech news, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు