పుట్టబోయే బిడ్డకు సంబంధించిన సమాచారంపై ఇంటర్నెట్‌లలో ఎన్నో విషయాలు దొరుకుతాయి. అంతేకాదు మీ ఇంటి వద్ద ఉన్న ఇరుగుపొరుగువారితోపాటు మీ కుటుంబీకులు కూడా వాళ్లకి తెలిసిన ఏవో స్వంత అభిప్రాయాలను చెబుతారు. అయితే, వీటిలో చాలా వరకు అన్నీ శాస్త్రీయ మద్ధతు లేని అపో హలు మాత్రమేనని తల్లి గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
అపోహ 1...
పుట్టబోయే శిశువు ఆడా, మగా అని గర్భవతి పొట్టను చూసి అంచనా వేస్తారు. అదే ఒకవేళ గర్భం సైజు చిన్నగా ఉంటే.. పుట్టబోయేది మగపిల్లాడు అని.. కడుపు పెద్దగా ఉంటే.. ఆడపిల్ల అని అంచనా వేస్తారు.
ఫ్యాక్ట్..
నేషనల్ హెల్త్ సర్వీస్ NHS ప్రకారం ఈ అపోహకు సైంటిఫిక్ మద్ధతు లేదు. పిల్లల లింగాన్ని నిర్ధారించడానికి, కడుపు పరిమాణానికి ఏ సంబంధం ఉండదు. ఇది గర్భిణి కండరాల పరిమాణం, నిర్మాణం, ఆకారం, పిండం ఉన్న స్థానాన్ని బట్టి.. ఆమె కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బట్టి ఆధారపడి ఉంటుంది.
అపోహ 2..
అప్పుడే పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలు ఇవ్వకూడదు!
ఫ్యాక్ట్..
ముర్రుపాలు మొదటగా వచ్చే తల్లిపాలు. అవి కాస్త పసుపు రంగులో ఉంటాయి. ఇవి ప్రోటీన్లతో నిండిన కొలొస్ట్రమ్. దీనిలో అంటువ్యాధులు రాకుండా నివారించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పాలను శిశువుకు కచ్ఛితంగా పట్టాలని సిఫార్సు చేశారు. అయినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ ముర్రుపాలు పట్టకూడదని న మ్మి దీన్ని విస్మరిస్తున్నారు.
అపోహ3..
నవజాత శిశువుకు పుట్టగానే ముందుగా తేనె ఇవ్వాలి అని అంటారు. ఇది పురాతన సంప్రదాయం.
ఫ్యాక్ట్..
నవజాత శిశువుకు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. తేనెలో అపరిపక్వతలో ఉన్న క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టిరియా బీజాంశాలు కలిగి ఉంటుంది. ఇది శిశువు ఇవ్వటం ద్వారా శిశు బోటులిజం అనే ప్రాణాంతక వ్యాధికి కారణమవుతుంది. ఇది ప్రమాదకరం.
అపోహ4..
నవజాత శిశువుకు ఆహారంగా పండ్ల రసాలను ఇవ్వచ్చు.
ఫ్యాక్ట్..
పండ్ల రసాల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కానీ, ఇది శిశువు పేగులపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నవజాత శిశువులు మొదటి ఏడాదిలో పండ్ల రసాలను జీర్ణించుకోలేరు.
అపోహ5..
రెండు లేదా మూడో గర్భంతో పోలిస్తే.. మొదటి కాన్పు కాస్త ఆలస్యంగా అవుతుంది.
ఫ్యాక్ట్..
ఇది నిజం కాదు! మహిళ రుతుచక్రం ఆధారంగా డెలివరీ డేట్‌ను ఫిక్స్ చేస్తారు. ఒకవేళ రుతుచక్రానికి తక్కువ సమయం ఉంటే.. ముందుగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. రుతుచక్రం సమయం ఎక్కువైతే.. కాస్త ఆలస్యం కావచ్చు. అయితే, రుతుచక్రం 28 రోజులు ఉంటే, ఆ గడువు తేదీకి దగ్గరగా వచ్చినపుడు అప్పటి పరిస్థితులను బట్టి డెలివరీ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mother milk, Mothers