Corona: కోవిడ్ సోకిన పిల్లల్లో కంగారు పెడుతున్న కొత్త రకం వ్యాధి లక్షణాలు.. ఆ లక్షణాలు ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కోవిడ్ సోకిన ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎల్‌హెచ్(హిమోప్యాగోసైటిక్ లింపో హిస్టియోసిస్) అనే వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ ఇద్దరు చిన్నారులకు చేసిన వైద్య పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైంది. ఐదు సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు పిల్లలను కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేర్పించగా.. ఆ తర్వాత హెచ్‌ఎల్‌హెచ్ వ్యాధి లక్షణాలు కూడా కనిపించాయని.. వైద్య పరీక్షల్లో హెచ్‌ఎల్‌హెచ్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు రిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

 • Share this:
  బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. అయితే.. మరణాల సంఖ్య మాత్రం ఇప్పటికీ కలవరపాటుకు గురిచేస్తూనే ఉంది. అంతేకాదు.. కోవిడ్ సోకిన పిల్లల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కోవిడ్ సోకిన ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎల్‌హెచ్(హిమోప్యాగోసైటిక్ లింపో హిస్టియోసిస్) అనే వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ ఇద్దరు చిన్నారులకు చేసిన వైద్య పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైంది. ఐదు సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు పిల్లలను కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేర్పించగా.. ఆ తర్వాత హెచ్‌ఎల్‌హెచ్ వ్యాధి లక్షణాలు కూడా కనిపించాయని.. వైద్య పరీక్షల్లో హెచ్‌ఎల్‌హెచ్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు రిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ కొత్త రకం వైరస్ బారిన పడిన వారికి విరేచనాలు, కడుపునొప్పి, వాంతులు తదితర లక్షణాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో తెల్ల రక్త కణాల సంఖ్య ఊహించని విధంగా తగ్గి.. రక్తంలోని సీ-రియాక్టివ్ ప్రొటీన్(సీఆర్‌పీ) విపరీతంగా పెరగడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతుంటారని తెలిపారు. కరోనా అనంతరం ఈ అరుదైన వ్యాధి లక్షణాలు కొందరు చిన్నారుల్లో కనిపిస్తున్నాయని.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

  కేన్సర్‌ రోగుల మాదిరిగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అతి ప్రతిస్పందన వల్ల హెచ్‌ఎల్‌హెచ్‌ బారినపడే అవకాశం ఉంది. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ భారీగా పడిపోతుంది. కరోనా నుంచి కోలుకున్న చిన్నారులకు పొంచి ఉన్న మరో ముప్పు ఎంఐఎస్ వ్యాధి. రిమ్స్‌లో కూడా మల్టిపల్ ఇంఫ్లామెటరి సిండ్రోమ్(ఎంఐఎస్) సోకిన ఇద్దరు చిన్నారులకు చికిత్సనందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాళ్లు, పొట్ట ఉబ్బరం, భరించలేని కడుపునొప్పి, జ్వరం ఎనిమిది రోజుల కంటే ఎక్కువగా ఉండటం, వేళ్ల మధ్య, చేతి కింద పొట్టులా రాలడం, గులాబీ రంగులోకి నాలుక మారడం ఎంఐఎస్ ప్రధాన లక్షణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

  ప్రస్తుతానికి పిల్లలపై కరోనా ప్రభావం తక్కువగానే ఉందని.. 80 నుంచి 90 శాతం మందిలో అసలు వైరస్ సోకినట్లు కూడా తెలియడం లేదని, కేవలం ఒకటి నుంచి రెండు శాతం మందిలోనే నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే.. పిల్లలకు కరోనా వచ్చిపోయిన నెల రోజుల తర్వాత ఎంఐఎస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోందని.. ఎంఐఎస్ కారణంగా పిల్లల్లో ప్రధాన అవయువాలు దెబ్బతింటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో కూడా చాలామంది చిన్నారుల్లో ఎంఐఎస్ లక్షణాలు కనిపించాయని, ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కూడా అదే పరిస్థితి ఉందని వైద్యులు వెల్లడించారు.

  ఇది కూడా చదవండి: Constable: మేనమామ పరువు కాపాడాలని మరదలిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

  అయితే.. ఎంఐఎస్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే 98 శాతం కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పడం కొంత ఊరట కలిగించే విషయం. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పిల్లల్లో ఈ ఎంఐఎస్ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. ఎంఐఎస్ కారణంగా కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడుతో పాటు గుండె కూడా ప్రభావితం అయ్యే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: