తమిళనాడులో (Tamil nadu) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దసరా పండుగ నేపథ్యంలో రోడ్లంతా జనాలతో రద్దీగా మారిపోయాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అక్కడ ఏంజరిగిందో కూడా ఎవరికి అర్ధం కాలేదు. సెకనుల వ్యవధిలో అక్కడ ప్రదేశమంతా బీభత్సంగా మారిపోయింది. కాగా, అక్కడ హీలియం ట్యాంకు పేలినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న షాపులు దెబ్బతిన్నాయి.
పేలుడు ధాటికి ఒక వక్తి మరణించగా, నలుగురు గాయాల పాలయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలు దెబ్బతిన్నాయి. చనిపోయిన వ్యక్తిని రవిగా పోలీసులు గుర్తించారు. కాగా, బెలున్ లను అమ్మే వ్యక్తి హీలియం ట్యాంకు పేలడం వలన ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు. బెలూన్ లు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది.
#WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ
— ANI (@ANI) October 3, 2022
ప్రస్తుతం పేలుడు ప్రభావంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటన జరగ్గానే స్థానికులు పోలీసులకు అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడికి అంబులెన్స్ లు చేరుకున్నాయి. గాయపడ్డవారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా కేరళలో (kerala) ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
తిరువనంతపురానికి చెందిన విళింజమ్ ప్రాంతానికి చెందిన అపర్ణ అనే మహిళకు శుక్రవారం ఇంటి దగ్గర ఒక పిల్లి (Cat bite) కరించింది. అయితే.. ఆమె వెంటనే తన సబ్బుతో కాలును క్లీన్ చేసుకుంది. ఆతర్వాత... దగ్గరలోని ప్రభుత్వ క్లినిక్ కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ అపర్ణ, తన తండ్రితో కలిసి తన వంతు వచ్చే వరకు అక్కడే ఉన్న బెంచ్ మీద వేచి చూస్తున్నారు. ఇంతలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
అపర్ణ కూర్చున్న బెంచీ కింద ఒక కుక్క కూర్చుని ఉంది. ఆమె కాలు పొరపాటున కుక్క తోకపై పడింది. దీంతో కుక్క.. బాధతో కుయ్ అంటూ అరుస్తూ.. ఆమె కాలిని కరిచి (Dog bite) గాయపర్చింది. వెంటనే ఆమె భయపడిపోయింది. అక్కడ ఉన్న సిబ్బంది ఆమె కాలును సబ్బుతో కడుక్కొమని చెప్పి, కట్టు కట్టి.. మరో ఆస్పత్రికి పంపించారు. దీంతో పాపం... ఆమె అసలే.. పిల్లి కరిచిందని బాధలో ఉండగా, ఇప్పుడు దానికి తోడు కుక్క కూడా కరిచింది. మహిళ తెగ భయపడిపోతుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIRE, Tamilnadu, Viral Video