తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ (Army Chief General Bipin Rawat), ఆయన భార్య సహా 13 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ హెలికాఫ్టర్‌లో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో బయటపడిన ఏకైక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. నీలగిరి జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న 14 మందిలో 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (Varun Singh) వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ (27987) లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) స్క్వాడ్రన్‌లో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరుణ్ సింగ్‌కి 2021 ఆగస్టు 15న అతనికి శౌర్య చక్ర అవార్డు లభించింది. ప్రస్తుతం వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సమాచారం అందలేదు. ఆయనను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందజేస్తున్ఆరు.
ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం.. నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీ (Defense College) కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నారు. వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు.
కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.
హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తునమంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 9 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఐతే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వారు ఎవరన్నది గుర్తు పట్టడం కష్టంగా మారింది. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ఓ సారి తప్పించుకొని.. ఇప్పుడు ఇలా..
బిపిన్ రావత్‌కు గతంలోనూ ఓ సారి హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో చీతాలో జరిగింది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో బిపిన్ రావత్ లెఫ్టినెంట్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.