హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మూడు రోజుల క్రితం రోడ్డుపైన ప్రసవం.. అంతలోనే ఊహించని పరిణామం.. అసలేం జరిగిందంటే..

మూడు రోజుల క్రితం రోడ్డుపైన ప్రసవం.. అంతలోనే ఊహించని పరిణామం.. అసలేం జరిగిందంటే..

మహిళకు సపర్యలు చేస్తున్న 108 సిబ్బంది

మహిళకు సపర్యలు చేస్తున్న 108 సిబ్బంది

komaram bheem: కొమురంభీం ఆసిఫాబాద్ లో అనుకొని ఘటన జరిగింది. మూడు రోజుల క్రితం రోడ్డుపైన మహిళ ప్రసవించింది. మగ శిశువు పుట్టాడన్న ఆనందం గంటల వ్యవధిలోనే విషాదంగా మారింది.

గత కొన్ని రోజులుగా ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాగులు, వంకలు, ప్రాజెక్టులు పొంగిపోర్లుతున్నారు. అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. అనేక చోట్ల రహదారులు కూడా మూసుకుపోయాయి. ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతుంది. కుండపోతగా (Heavy rains)  కురుస్తున్న వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ప్రజలు సరైన రవాణా, వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక మహిళ ఆసిఫాలోని ఒక యువతి నడి రోడ్డుమీద బిడ్డను ప్రసవించింది.

పూర్తి వివరాలు.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad district)  బెజ్జూరు మండలంలోని నాగేపల్లిలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం నడిరోడ్డుపైన ప్రసవించిన మగ శిశువు వైద్యం అందక మృతి చెందాడు. మూడు రోజులకే ఆ మగ శిశువుకు నూరేళ్ళు నిండాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కొడిపె మల్లుబాయికి మూడు రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.

అయితే కుశ్నపల్లి వాగు వద్ద వరద కారణంగా 108 వాహనం మొగవెల్లి గ్రామానికి చేరుకునే పరిస్థితి లేకపోయింది. మరో దారిలో కూడా చేరుకునే ప్రయత్నం చేసినప్పటికి కోయపల్లి సమీపంలోని వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో ఈ దారిలో కూడా అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో వంతెన వరకు తీసుకువెళ్ళారు. వంతెన వద్ద రోడ్డు కోతకు గురికావడంతో ముందుకు వెళ్ళలేకపోయారు.

అక్కడె నిలిచిపోవడంతో 108 సిబ్బంది కాలినడక వెళ్ళి అక్కడే వైద్యం అందించడంతో మల్లుబాయి మగశిశువుకు జన్మనిచ్చింది. కాగా ఇంటి వద్ద ఉండగా శిశువు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ఆసుపత్రికి వెళ్దామంటే వాహన సదుపాయం లేకపోవడంతో ఇంట్లోనే అయోమయ పరిస్థితిలో ఉన్న సమయంలోనే మూడు రోజుల బాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

First published:

Tags: Adilabad, Asifabad, Heavy Rains, Telangana News

ఉత్తమ కథలు