Uttarakhand: ఉత్తరాఖండ్​ అల్లకల్లోలం.. ఇప్పటికే 64 మంది దుర్మరణం.. శిథిలాలు తీస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

ఉత్తరాఖండ్​లో సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది

వారం క్రితం కేరళ (Kerala) వర్షాలతో అట్టుడికిపోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలామందికి తిండి కూడా సరిగా దొరకలేదు. ఇపుడు ఉత్తరాఖండ్‌ (Uttarakhand) భారీ వర్షాలతో అల్లాడుతోంది.

  • Share this:
    వారం క్రితం కేరళ (Kerala) వర్షాలతో అట్టుడికిపోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలామందికి తిండి కూడా సరిగా దొరకలేదు. ఇపుడు ఉత్తరాఖండ్‌ (Uttarakhand) భారీ వర్షాలతో అల్లాడుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు 107 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్‌ చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాకులు, బ్రిడ్జిలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత, వరదల కారణంగా ఇప్పటి వరకూ 64 మంది మృత్యువాత (died) పడ్డారు. 11 మంది గల్లంతయ్యారు. సహాయ బృందాలు శిథిలాలను వెలికితీస్తున్న కొద్దీ గల్లంతైన వారి మృతదేహాలు (dead bodies) బయట పడతున్నాయి. ఉత్తరాఖండ్‌ నైనితాల్‌ జిల్లాలో 34 మంది, చంపావత్‌ జిల్లాలో 11 మంది మృతిచెందారు. ప్రభుత్వ అంచనాల మేరకు వరదల కారణంగా దాదాపు రూ.7,000 కోట్ల నష్టం వాటిల్లింది. విరిగిపడిన కొండ చరియలను తొలగించడంతో పాటు సహాయక చర్యలను సహాయక సిబ్బంది ముమ్మరం చేశారు.

    ఆదుకుంటాం..: కేంద్ర హోంమంత్రి

    ఉత్తరాఖండ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించారు.. సీఎం పుష్కర సింగ్‌ ధామీ, గవర్నర్‌ గుర్మీత్‌ సింగ్‌తో కలిసి హోంమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాఖండ్‌కు అండగా ఉంటామని అమిత్​షా హామీ ఇచ్చారు.



    నైనిటాల్‌, అల్మోరా, హల్ద్వానీలో రోడ్లను క్లియర్‌ చేశామన్నారు. త్వరలోనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగుపడిందని హోంమంత్రి తెలిపారు. చార్‌దామ్‌ యాత్రను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితేఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టం 7 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.



    పర్వతారోహణ కోసం వచ్చి మృత్యులోకాలకు..

    ఉత్తరాఖండ్‌ పర్వతారోహణ కోసం (For mountaineering) పశ్చిమ్ బెంగాల్ నుంచి వచ్చిన వారిలో 9 మంది కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. భాగేశ్వర్ జిల్లా కుమావ్ ప్రాంతంలోని సుందర్‌దంగా హిమనీనదం దగ్గర ఐదు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన నలుగురు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ మార్గంలో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారత వాయుసేనకు చెందిన మూడు హెలికాఫ్టర్లు రెస్క్యూ ఆపరేషన్స్‌ (Rescue operation)లో పాల్గొంటున్నాయి. విరిగిపడిన కొండచరియల (landslides)ను తొలగిస్తున్నారు. భాగేశ్వర్ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో వరదల్లో నుంచి నలుగురిని రక్షించారు.
    Published by:Prabhakar Vaddi
    First published: