• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HEAVY RAINS FOR TODAYS IN TELUGU STATES AS CYCLONE TAUKTAE VRY

Tauktae cyclone : తౌక్తే ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం..ఆది,సోమ వారాల్లో వర్షాలు

Tauktae cyclone : తౌక్తే ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం..ఆది,సోమ వారాల్లో వర్షాలు

తౌక్తే ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం..ఆది,సోమ వారాల్లో వర్షాలు ( ప్రతికాత్మక చిత్రం )

Tauktae cyclone : అయిదు రాష్ట్రాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్న తౌక్తే తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడ కనిపించనుంది. దీంతో ఆది, సోమ వారల్లో వర్షాలు పడనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరించింది.ముఖ్యంగా రాయలసీమ,దక్షిణ కొస్తా తీరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడ భారీ వర్షాలు కురువనున్నట్టు వాతవరణ శాఖ వివరాలు వెల్లడించింది.

  • Share this:
    ఓవైపు కరోనాతో ప్రజలు సతమతవుతుంటే మరోవైపు తౌక్తే తుఫాను వణుకు పుట్టిస్తోంది. వాయుగుండం తుఫానుగా మారి దేశంలోని అయిదు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే కేరళను భారీ వర్షాలతో ముంచెత్తున్న తౌక్తే తుఫాను తీరం దాటే సమయంలో గంటకు నూట డెబ్బై అయిదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రధాని మోడీ సైతం తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో సమీక్ష నిర్వహించారు.

    భారీ గాలులు, కుండపోతున్న వర్షం కేరళలో తుఫానుతో బీభత్సం సృష్టిస్తోంది. తుఫానుతో కేరళ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినా తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తుఫాను ప్రభావం కేరళను అతమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాలతో గుజరాత్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక తుఫాను ప్రభావిత రాష్ట్రాలను ఆదుకునేందుకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా రాష్ట్రాల్లోకి విధుల్లో మునిగిపోయారు.

    ఇక తెలుగు రాష్ట్రాల్లో కూగ తౌక్తే తుఫాను ప్రభావం కనిపించున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొద్దిపాటీ వర్షాలు కురిశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తౌక్తే ప్రభావం ఉండనుంది. దీంతో ఆది, సోమ వారల్లో వర్షాలు కురవనున్నట్టు వాతవరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ,దక్షిణ కొస్తా తీరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడ భారీ వర్షాలు కురువనున్నట్టు వాతవరణ శాఖ వివరాలు వెల్లడించింది.   మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడ కేరళ తీరాన్ని మే 31నే తీరాన్ని తాకనున్నట్టు వాతవరణ శాఖ ఇదివరకే వెల్లడించింది. దీంతో వర్షా కాలం కొంత ముందే ప్రారంభం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    అగ్ర కథనాలు