థాయ్‌లాండ్‌లో 'పబుక్' బీభత్సం..అండమాన్‌ వైపు దూసుకొస్తున్న తుఫాన్

పబుక్ బీభత్సంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 1989లో థాయ్‌లాండ్‌ను తుడిచిపెట్టేసిన 'గే' తుఫాన్‌ను గుర్తుచేసుకుంటున్నారు. ఆ స్థాయిలో విధ్వంసం ఉంటుందని అధికారులు సైతం హెచ్చరికలు జారీచేయడంతో థాయ్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

news18-telugu
Updated: January 4, 2019, 8:17 AM IST
థాయ్‌లాండ్‌లో 'పబుక్' బీభత్సం..అండమాన్‌ వైపు దూసుకొస్తున్న తుఫాన్
పబుక్ తుఫాన్ కదలికలు (Image:Windy)
  • Share this:
దక్షిణ చైనా సముద్రంలో పబుక్ తుఫాన్ అలజడి రేపుతోంది. థాయ్‌లాండ్ గల్ఫ్‌తీరంలో ఇప్పటికే అల్లకల్లోలం సృష్టిస్తోంది. శనివారం అండమాన్ సముద్రంలో కలిసి.. ఆదివారం అండమాన్, నికోబార్ దీవులను పబుక్ తుఫాన్ తాకే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో శనివారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 6న అండమాన్‌ను తాకిన తర్వాత..దిశను మార్చుకొని మయన్మార్ వైపు పయనించే అవకాశముందని తెలిపింది. తుఫాన్ నేపథ్యంలో ఒడిశా సైతం 7 జిల్లాలను అప్రమత్తంచేసింది. ఐతే దీని ప్రభావం ఏపీపై ఉండదని అధికారులు వెల్లడించారు.

గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో తీరం దాటిన పబుక్ తుఫాన్..అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో విరుచుకుపడింది. 16 ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 7 మీటర్ల మేర ఎగసిపడుతుండడంతో..బీచ్‌ల నుంచి టూరిస్టులు పరుగులు తీశారు. థాయ్‌లాండ్ గల్ఫ్ తీరంలో ఫెర్రీ, విమాన సర్వీసులను నిలిపివేశారు.

టూరిస్ట్ సీజన్ కావడంతో తీర ప్రాంతాల్లోని రిసార్ట్‌లకు అధికారులు హెచ్చరికలు పంపారు. వెంటనే ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పర్యాటకులకు సూచించారు. పబుక్ బీభత్సంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 1989లో థాయ్‌లాండ్‌ను తుడిచిపెట్టేసిన 'గే' తుఫాన్‌ను గుర్తుచేసుకుంటున్నారు. ఆ స్థాయిలో విధ్వంసం ఉంటుందని అధికారులు సైతం హెచ్చరికలు జారీచేయడంతో థాయ్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 1989లో వచ్చిన గే తుఫాన్ ధాటికి గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో 900 మందికి పైగా చనిపోయారు.

పబుక్ తుఫాన్ గమనాన్ని ఇక్కడ లైవ్‌లో చూడండి:
Published by: Shiva Kumar Addula
First published: January 4, 2019, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading