హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Heavy rain: ఉరుములు మెరుపులతో భారీ వర్షం..వణికిపోయిన ఢిల్లీ

Heavy rain: ఉరుములు మెరుపులతో భారీ వర్షం..వణికిపోయిన ఢిల్లీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Heavy rain and thunderstorm in Delhi : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మండే ఎండలతో విసిగిపోయిన జనం వానలు కురవడంతో కాస్త ఉపశమనం పొందారు.

Heavy rain and thunderstorm in Delhi : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మండే ఎండలతో విసిగిపోయిన జనం వానలు కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కూడా పడింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ గాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం, గాలితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండి హౌస్‌, రైసినా రోడ్డు, జంతర్‌మంతర్‌, ఐటీఓ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లుపడ్డారు.

విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్‌ సమస్యను ఎదుర్కొన్నాయి. అధికారుల నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా ఎనిమిది విమానాలను జైపూర్, లక్నో, చండీగఢ్, అహ్మదాబాద్, డెహ్రాడూన్‌లకు మళ్లించినట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. భీకర గాలుల కారణంగా రోడ్డుపై వెళ్తున్న కార్లు సైతం వణికాయి.

ALSO READ  Putin Losing Eyesight: కంటిచూపు కోల్పోతున్న పుతిన్..పుతిన్ మూడేళ్లకు మంచి బతకడట!

పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి. వర్షం వల్ల ఏర్పడిన బీభత్సకరమైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలు చోట్ల భవనాలకు ఉన్న ఏసీలు వేలాడుతూ కనిపించాయి. పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా పెకిలి నేల కూలాయి. ఢిల్లీతో పాటు గుర్గావ్‌, నోయిడాలో కూడా వర్షం పడింది. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడంతో ఇళ్లు, కార్లు కూడా దెబ్బతిన్నాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యాయి.

First published:

Tags: Delhi, Heavy Rains

ఉత్తమ కథలు