ఉత్తరాఖండ్‌లో మరో జల ప్రళయం.. కొట్టుకుపోయిన డ్యామ్.. షాకింగ్ వీడియోలు

ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం

Uttarakhand: వరద ప్రవాహం ధాటికి రైనీ తపోవన్ వద్ద ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్ డ్యామ్ తెగిపోయింది. డ్యామ్ కొట్టుకుపోవడంతో భారీగా వరద పోటెత్తింది.

 • Share this:
  ఉత్తరాఖండ్‌లో మరో జల ప్రళయం సంభవించింది. చమోలి జిల్లాలో ధౌలిగంగ నదికి ఆకస్మిక వరద పోటెత్తింది. హిమాలయాల్లోని మంచు చరియలు విరిగిపడడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా ఊహించంతగా పెరిగిపోయింది. వరద ప్రవాహం ధాటికి రైనీ తపోవన్ వద్ద ఉన్న రుషిగంగ డ్యామ్ తెగిపోయింది. పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోవడంతో భారీగా వరద పోటెత్తింది. వరద ధాటికి రైనీ గ్రామం దాదాపు జలసమాధి అయింది. నది తీరంలో ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదలో 50 మందికి పైగా గల్లంతయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  చమోలి నుంచి దిగువకు భారీగా భారీగా ప్రవహిస్తోంది. చమోలి, కర్ణ ప్రయాగ్, రుద్ర ప్రయాగ్ ప్రాంతాల ప్రజలు నది తీరానికి దూరంగా వెళ్లిపోవాలని హెచచరికలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్తునట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పలువురు నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది.

  రెండు ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లాయని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా బయలుదేరి వెళ్లాయని పేర్కొన్నారు. మరో మూడు అదనపు బృందాలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు చెప్పారు.

  ఎవరైనా వరదలో చిక్కుకుంటే 1070 లేదా 9557444486 నెంబర్లకు ఫోన్ చేయాలని ఉత్తరాఖండ్ సీఎం సూచించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: