అతని ఎక్స్‌రే రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ షాక్.. గుండె కుడివైపు..

జమాలుద్దీన్ ఎక్స్‌రే రిపోర్ట్స్ చూసి షాక్ తిన్నట్టు శశికాంత్ దీక్షిత్ తెలిపారు. అతని శరీరంలో చాలావరకు అవయవాలు ఉండాల్సిన స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు.

news18-telugu
Updated: October 4, 2019, 10:23 AM IST
అతని ఎక్స్‌రే రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ షాక్.. గుండె కుడివైపు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఓ పేషెంట్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతని శరీరంలోని అవయవాలు సాధారణ స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో ఉన్నాయి. ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు.. కుడివైపుకు ఉండాల్సిన కాలేయం,పిత్తాశయం ఎడమవైపుకు ఉన్నాయి. దీంతో డాక్టర్లు షాక్ తిన్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన జమాలుద్దీన్ అనే పేషెంట్‌ ఈ సమస్యతో బాధపడుతున్నాడు.ఇటీవల కడుపునొప్పితో అతను ఆస్పత్రిలో చేరగా.. ఎక్స్‌రే రిపోర్ట్స్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి.

జమాలుద్దీన్ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్టుగా గుర్తించాం. కానీ కుడివైపున ఉండాల్సిన బ్లాడర్.. ఎడమవైపు ఉండటంతో అందులో రాళ్లు తొలగించడం చాలా కష్టంగా మారింది. దాంతో త్రీ డైమెన్షన్ ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా సర్జరీ చేయాల్సి వచ్చింది.
డా.శశికాంత్ దీక్షిత్


జమాలుద్దీన్ ఎక్స్‌రే రిపోర్ట్స్ చూసి షాక్ తిన్నట్టు శశికాంత్ దీక్షిత్ తెలిపారు. అతని శరీరంలో చాలావరకు అవయవాలు ఉండాల్సిన స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు సర్జరీ చేయడం చాలా కష్టమన్నారు.పిత్తాశయంలో రాళ్లు తొలగించడంతో ప్రస్తుతం జమాలుద్దీన్ కోలుకుంటున్నాడని చెప్పారు.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>