హోమ్ /వార్తలు /జాతీయం /

సుప్రీం కోర్టులో రఫేల్ డీల్‌పై విచారణ.. డాక్యుమెంట్స్ దొంగిలించారన్న ఏజీ

సుప్రీం కోర్టులో రఫేల్ డీల్‌పై విచారణ.. డాక్యుమెంట్స్ దొంగిలించారన్న ఏజీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న రఫేల్ డీల్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ డీల్‌లో ఎలాంటి అవినీతీ జరగలేదంటూ మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును రీకాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్.. డీల్‌కు సంబంధించిన డాక్యమెంట్స్ రక్షణశాఖ నుంచి దొంగిలించబడ్డాయని తెలిపారు.

ఇంకా చదవండి ...

    దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న రఫేల్ డీల్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ డీల్‌లో ఎలాంటి అవినీతీ జరగలేదంటూ మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును రీకాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్.. డీల్‌కు సంబంధించిన డాక్యమెంట్స్ రక్షణశాఖ నుంచి దొంగిలించబడ్డాయని తెలిపారు. జాతీయ భద్రతాకారణాల రీత్యా వాటిని కోర్టు ముందు హాజరుపరచలేమని చెప్పారు. అయితే, డాక్యుమెంట్స్ దొంగతనం గురయిన తర్వాతే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కాసేపట్లో సుప్రీం కోర్టుకు కేంద్రప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిదంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.. ప్రతీ వేదికపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.


    ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత డిసెంబర్ 4న తుదితీర్పును వెలువరించింది. ఈ డీల్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును రీకాల్ చేస్తూ మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరో నే అరుణ్ శౌరీలు.. మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టింది.

    First published:

    Tags: Congress, Narendra modi, Rafale Deal, Rahul Gandhi, Supreme Court

    ఉత్తమ కథలు