PUBG Mobile India : కొన్ని రోజులుగా ఇండియాలో పబ్ జీ గేమ్ ఆడుతున్నవారు ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు. గేమ్ ఆడుతుండగా... సడెన్‌గా క్లోజ్ అవుతోంది. లేదంటే... హెల్త్ రిమైండర్ పాప్ అప్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకు మించి ఎక్కువ సేపు గేమ్ ఆడితే హెల్త్‌కే ప్రమాదం అని అవి చెబుతున్నాయి. దీనిపై గేమర్లు మండిపడ్డారు. మా హెల్త్ సంగతి మీకెందుకు... గేమ్ రూల్స్ ప్రకారం గేమ్ ఉండాల్సిందే అని ఫైర్ అయ్యారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఎందుకంటే ఇండియాలో కొన్ని కోట్ల మంది పబ్ జీ ఆడుతున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టడమన్నది గేమ్ రూల్స్‌కి విరుద్దమని వారు రివర్స్ అవుతున్నారు. ఈ సమస్యను పరిశీలించిన మేనేజ్‌మెంట్... కంటిన్యూగా గేమ్ ఆడటం ప్రమాదమన్న మంచి ఉద్దేశంతోనే ఈ రూల్ తెచ్చామనీ, ఇప్పుడు అది తీసేశామనీ వివరిస్తూ... ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పింది.
Dear Players
Basis feedback from the community, we have now changed the Birthday Crate. The Healthy Gameplay System error has also been fixed, and you should be able to play uninterrupted. Lastly, payment systems are back up and running.We deeply apologize for the inconvenience!
— PUBG MOBILE INDIA (@PUBGMobile_IN) March 23, 2019
నిజానికి ఇదో మంచి ఉద్దేశంతో తెచ్చిన ఎర్రరే. ఎందుకంటే ఇండియాలో చాలా మంది గంటల తరబడి పబ్ జీ ఆడుతున్నారు. కొందరైతే... పదేసి గంటలు కూడా ఆడుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. పబ్ జీ గేమ్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. అందువల్ల గతవారం కంటిన్యూగా 6 గంటలకు మించి ఆడకుండా హెల్తీ గేమ్ ప్లే కండీషన్ తీసుకొచ్చింది యాజమాన్యం. ఫలితంగా 6 గంటల తర్వాత గేమ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతోంది. తిరిగి మర్నాడు ఆడుకోమంటూ పాప్ అప్ రూపంలో టైమ్ ఫ్రేమ్ వస్తుంది.
మర్నాడు తిరిగి ఆడదామంటే... చాలా మందికి అరగంటలోపే గేమ్ ఆగిపోతోంది. 18 ఏళ్ల లోపు వయస్సుగల ప్లేయర్స్‌కు 2 నుంచి 4 గంటల లోపే హెల్త్ రిమైండర్ నోటిఫికేషన్ వస్తోంది. ఈ ఎర్రర్‌ను సరిచేసినట్లు కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి :
పబ్ జీ గేమ్ ఆడుతుండగా పట్టేసిన నరాలు... యువకుడి మృతి
టీడీపీకి మరో ఎదురు దెబ్బ... వైసీపీలోకి మాజీ మంత్రి ?
తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం... రాహుల్‌తో డీల్ కుదిరిందా ?
డబ్బు కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారా... బీరువాలో రూ.1.20 కోట్లు ఏమయ్యాయి?
కొలిక్కి వచ్చిన టీడీపీ మేనిఫెస్టో... వైసీపీకి షాకిచ్చేలా ఉందా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, National, National News, PUBG