Vaccination: ఆ ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కేంద్రం సీరియస్... వ్యాక్సినేషన్‌పై మరోసారి క్లారిటీ

ఆ ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కేంద్రం సీరియస్

Covid Vaccination: ఈ కరోనాను అడ్డం పెట్టుకొని... కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. ఆ సందర్భంగా వ్యాక్సినేషన్‌కి సంబంధించి కేంద్రం స్పష్టమైన నోటీస్ మరోసారి జారీచేసింది.

  • Share this:
    Covid Vaccination: అసలే కరోనాతో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు నరకం చూస్తుంటే... కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు... వారి నుంచి ఎంత వీలైతే అంత డబ్బు లాగేయాలని కుట్రలు పన్నుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఆస్పత్రులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి ఆస్పత్రులు... మరోరకమైన కుట్రకు కూడా పాల్పడుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. కొన్ని ఆస్పత్రులు... కొన్ని హోటల్స్‌తో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. హోటల్స్‌కి వచ్చే అతిథులకు రహస్యంగా వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం అని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రకారం... ఇలా చేయడానికి వీలు లేదంటూ... నోటీస్ జారీ చేసింది.

    వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్:
    అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులకు చెక్ పెడుతూ... వ్యాక్సినేషన్ ఎలా చెయ్యాలనే అంశంపై మరోసారి గైడ్‌లైన్స్‌ను నోటీస్‌లో తెలిపింది. కేంద్రం వాటి ప్రకారం వ్యాక్సిన్ ఎక్కడ ఇవ్వాలంటే...
    1.ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం.
    2.ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం.
    3.ప్రభుత్వ ఆఫీసుల దగ్గర ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం. దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహిస్తాయి. అలాగే... ప్రైవేట్ కంపెనీల దగ్గర ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం.
    4.గ్రూప్ హౌసింగ్ సొసైటీలు నిర్వహించే... హోమ్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు. వీటిని ముసలివారి కోసం, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్నారు. ఇంకా... RWA ఆఫీసులు, కమ్యూనిటీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూళ్లు లేదా కాల్జీలు, ఓల్డ్ ఏజ్ హోమ్‌ల దగ్గర తాత్కాలికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది.

    రాష్ట్రాలకు కేంద్రం పంపిన నోటీస్


    పైన చెప్పిన చోట్ల కాకుండా ఇంకెక్కడా వ్యాక్సిన్లను వేయడానికి వీలు లేదు. ఈ కారణంగా... స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్లు వేయడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలను వెంటనే ఆపేయాలని నోటీసులో కేంద్రం ఆదేశించింది. ఇకపై అలా చేసేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది.

    ఇది కూడా చదవండి: Business Ideas: తక్కువ పెట్టుబడి... భారీ లాభాలు.. నష్టాలు లేని వ్యాపార ఐడియా

    ఈ విధంగా... నేషనల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగేలా... అన్ని చర్యలూ తీసుకోవాలంటూ... కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి... అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీస్ పంపారు.
    Published by:Krishna Kumar N
    First published: