ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. అత్యవసర చికిత్సా విభాగం కింద భారత ప్రభుత్వం కూడా రెండు వ్యాక్సిన్లకు అనుమతిచ్చింది. అయితే అత్యవసర వినియోగం మినహా మిగతా సందర్భాల్లో డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII), భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాలకుఅత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కోసం కోవిన్(Co-WIN App) ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ యాప్ ఇంకా తయారీ దశలోనే ఉంది. త్వరలోనే ఈ యాప్ విడుదల కానుంది. అయితే కొందరు ఫేక్ గాళ్లు ఈ యాపై పై కూడా కన్నేశారు. Co-WIN పేరుతో ఫేక్ యాప్ లను రూపొందించి యాప్ స్టోర్లలో ఉంచారు. కొందరు అమాయకులు ఇదే నిజమైనదని భావించి వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
అయితే ఆ యాప్ లన్నీ ఫేక్ అని అధికారులు చెబుతున్నారు. ఆ యాప్ ను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అలాంటి యాపుల్లో నమోదు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు హెల్త్ మినిస్ట్రీ సైతం ప్రకటన విడుదల చేసింది. యాప్ విడుదలైన సమయంలో తామే చెబుతామని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఇలాంటి ఫేక్ యాప్ లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Published by:Nikhil Kumar S
First published:January 06, 2021, 18:25 IST