Coronavirus Variant: కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్ లో కొత్త రకం కరోనా వైరస్ ‘డబుల్ యాక్షన్’..

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లు దొరికిన సంగతి తెలిసిందే. ఒక్కో దేశంలో ఒక్కో రకం కరోనా వైరస్ ఆనవాళ్లు ఉంటున్నాయి. తాజాగా భారత్ శాస్త్రవేత్తలు కూడా కొత్త రకం కరోనా వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు.

  • Share this:
    కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో కొత్త రకం కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లు దొరికిన సంగతి తెలిసిందే. ఒక్కో దేశంలో ఒక్కో రకం కరోనా వైరస్ ఆనవాళ్లు ఉంటున్నాయి. తాజాగా భారత్ శాస్త్రవేత్తలు కూడా కొత్త రకం కరోనా వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. కొత్తరకం కరోనా వైరస్ కు రెండు సార్లు రూపాంతరం చెందే లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. భారత్ లోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా వైరస్ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ప్రతీ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వైరస్ ను అరికట్టేందుకు చర్యలను కూడా ప్రారంభించారు.

    అయితే వెల్లువలా వస్తున్న ఈ కరోనా కేసులకు, తాజాగా బయటపడిన రెండుసార్లు రూపాంతరం చెందే కొత్త రకం కరోనా వైరస్ కు ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన జరిపేంత స్థాయిలో లభ్యమవలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నారు. తెలంగాణ సర్కారు కూడా తాజాగా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే బాటలో పలు రాష్ట్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, గత అనుభవాల దృష్ట్యా లాక్ డౌన్ విధించే అవకాశాలు లేనప్పటికీ జన సమ్మూహాలను కట్టడి చేసే చర్యలను మాత్రం తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

    కాగా, మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ దేశాలన్నింటినీ వణికించిన కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాక్సినేషన్ ను ప్రపంచ దేశాలకు అందించే విషయంలో భారత్ శాస్త్రవేత్తలు అందరి కంటే ముందున్నారు. భారత్ ప్రభుత్వం కూడా ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో ఉదారంగా వ్యవహరిస్తుండటంపై ప్రశంసలు వస్తున్నాయి.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published: