Home /News /national /

HEALTH MINISTRY ISSUES GUIDELINES FOR ADMINISTERING COVID 19 VACCINES TO PREGNANT WOMEN SSR GH

COVID-19 Vaccine: గర్భిణులకు వ్యాక్సిన్‌పై కుండ బద్ధలు కొట్టిన కేంద్రం.. క్లియర్‌గా ఏం చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గర్భిణులు కరోనా వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో కానీ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ దగ్గర ఆన్‌ సైట్‌ విధానంలో కానీ నమోదు చేసుకోవచ్చు. ఆ వెంటనే వ్యాక్సిన్‌ డోసు కూడా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ప్రెగ్నెన్సీ వల్ల కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ పెరగదు.

ఇంకా చదవండి ...
కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించింది. అందరిలానే వారు కూడా టీకా తీసుకోవచ్చని ప్రకటించింది. గర్భిణులు కరోనా వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో కానీ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ దగ్గర ఆన్‌ సైట్‌ విధానంలో కానీ నమోదు చేసుకోవచ్చు. ఆ వెంటనే వ్యాక్సిన్‌ డోసు కూడా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ప్రెగ్నెన్సీ వల్ల కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ పెరగదు. చాలామంది గర్భిణుల్లో లక్షణాలు లేకుండా లేదా చిన్నపాటి లక్షణాలతో కోవిడ్ సోకుతుంది. అయితే వారికి లక్షణాలు కనిపించకపోయినా, కడుపులో బిడ్డకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గర్భిణులు టీకా తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పటికే కరోనా సోకిన గర్భిణులు.. డెలివరీ అయ్యాక టీకా వేయించుకోవాలని తెలిపింది.

వ్యాక్సిన్‌ వేయించుకున్నాక వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌ మాటేంటి అనే డౌట్‌ మీకు రావొచ్చు. దాని మీద కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్‌ వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. సాధారణ వ్యక్తుల మాదిరిగానే చిన్నపాటి జ్వరం వస్తుంది. ఇంజక్షన్‌ వేసిన దగ్గర నొప్పి ఉంటుంది. ఓ రెండు, మూడు రోజులు నలతగా ఉంటుంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది. ఈ మార్గదర్శకాలు పూర్తిగా చదువుకున్నాక కొవిన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోండి. లేదంటే ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి టీకా వేయించుకోండి.

వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కూడా గర్భిణులు కొవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు శానిటైజ్‌ చేసుకోవడం లాంటివి మరచిపోకూడదు. దాంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కొవిడ్‌ బారినపడకుండా ఉండొచ్చు. ఒకవేళ మీ ఇంట్లోకానీ, మీకు తెలిసినవాళ్ల ఇంట్లో కానీ గర్భిణులు ఉంటే వాళ్లకు ఈ విషయం చెప్పి... వ్యాక్సినేషన్‌ చేయించండి.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Central Government, Corona, Corona alert, Covid vaccine, Pregnancy, Pregnant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు