ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల పట్ల ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఎంత దారుణంగా వ్యహరిస్తున్నారో పలు సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. పేద, మధ్య తరగతి వారు ఆస్పత్రులకు వెళ్తే అంతే సంగతులు. అయితే తనకు కూడా ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో చేదు అనుభవం ఎదురైందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya ) తెలిపారు. సాధారణ రోగి వేషంలో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిని(Safdarjung Hospital) సందర్శించినప్పుడు సెక్యూరిటీ గార్డు తనను కొట్టాడని ఇటీవల మన్సుఖ్ మాండవియా తెలిపారు. గురువారం సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో.. నూతన వైద్య సదుపాయాల ప్రారంబోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. సాధారణ రోగి వేషంలో తాను ఆకస్మికంగా ఆస్పత్రికి వెళ్లినప్పుడు, బెంచ్‌పై కూర్చొవడానికి యత్నించానని చెప్పారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు తనన కొట్టి.. అక్కడ కూర్చొవద్దని కోరినట్టుగా తెలిపారు.
ఆస్పత్రిలో స్ట్రెచర్‌లు, ఇతర వైద్య సాయం పొందడంలో అనేక మంది పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆ సమయంలో తాను గమనించానని మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఓ 75 వృద్దురాలు తన కొడుకు కోసం స్ట్రెచర్ పొందడానికి గార్డులను వేడుకుంటున్న సంఘటనను ఆయన ఊదాహరణగా ప్రస్తావించారు. కానీ ఆమెకు సాయం లభించలేదని చెప్పారు.
ఆస్పత్రిలో సిబ్బంది ప్రవర్తనతో తాను అసంతృప్తి చెందినట్టుగా మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఆస్పత్రిలో 1,500 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ.. ఒక్క గార్డు కూడా ఆ వృద్దురాలికి ఎందుకు సాయం చేయలేదని ఆయన అడిగారు. ఎమర్జెన్సీ విభాగంలో సరిపడ మంది సెక్యూరిటీ గార్డులను ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఘటన గురించా తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తెలియజేశానని చెప్పారు. ఇది విని ప్రధాని మోదీ కూడా కలత చెందారని తెలిపారు. దీంతో ఆ సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారా..? లేదా..? మోదీ అడిగారని చెప్పారు. అప్పుడు వ్యక్తిని మాత్రమే కాకుండా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నందున సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేయలేదని సమాధానమిచ్చినట్టు తెలిపారు.
ఆస్పత్రి, వైద్యులు.. ఒక నాణెనికి ఉన్న రెండు ముఖాలు అని మన్సుఖ్ మాండవియా అభివర్ణించారు. కరోనా సమయంలో పేషెంట్లకు వైద్యులు చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. వైద్యులు ఒక జట్టుగా పనిచేయాలని సూచించారు. ఇక, గురువారం జరిగిన కార్యక్రమంలో కొత్త ఆక్సిజన్ ప్లాంట్, కరోనా పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రిని ప్రారంభించారు.
Married Woman: భర్త శారీరకంగా కలవడం లేదన్న భార్య.. సెక్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే..
ఇదిలా ఉంటే.. ఆగస్టు 24 న మన్సుఖ్ మాండవియా సాధారణ రోగిగా సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో(Safdarjung Hospital) అత్యవసర విభాగాన్ని పరిశీలించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత.. ఆయన CGHS డిస్పెన్సరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health minister, Security guard