HOME »NEWS »NATIONAL »health minister harsh vardhan strong counter to congress mp manish tewari for comments on vaccine hsn

Covid 19 Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ పై అనుమానమంటూ కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి హర్షవర్ధన్

Covid 19 Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ పై అనుమానమంటూ కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
కేంద్రమంత్రి హర్షవర్ధన్ (ఫైల్ ఫోటో)

ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టించి, ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న కరోనాను ఎట్టకేలకు జయించేశామన్న ధీమా ప్రతి ఒక్క పౌరుడిలోనూ కనిపిస్తోంది. కరోనాను జయించామంటూ కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పై పలు అనుమానాలు, అపోహలు రేకెత్తించేలా సోషల్ మీడియాలో కొందరు పుకార్లు సృష్టిస్తున్నారు.

  • Share this:
    భారత్ లో మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా జరగడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకాను అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టించి, ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న కరోనాను ఎట్టకేలకు జయించేశామన్న ధీమా ప్రతి ఒక్క పౌరుడిలోనూ కనిపిస్తోంది. కరోనాను జయించామంటూ కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పై పలు అనుమానాలు, అపోహలు రేకెత్తించేలా సోషల్ మీడియాలో కొందరు పుకార్లు సృష్టిస్తున్నారు. కరోనా వేక్సిన్ ను తీసుకుంటే వంధత్వం వస్తుందనీ, భవిష్యత్తులో పిల్లలు పుట్టరనీ ఈ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. వీటికి ఇప్పటికే కేంద్ర మంత్రి హర్షవర్థన్ కౌంటర్ ఇచ్చారు. ఈ వార్తలన్నీ నిరాధారమని స్పష్టం చేశారు. అయితే మరోసారి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియపై తాజాగా ఓ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

    కొవిడ్ 19 వ్యాక్సిన్ ప్రభావంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తాజాగా కామెంట్స్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం సురక్షితమేనా.? అన్న అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. ప్రజల్లో భయం పోగొట్టేందుకు ఏకంగా దేశాధినేతలే మొదటి కరోనా టీకాను తీసుకున్నారు. భారత్ లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ప్రభుత్వ ముఖ్యులు ఎవరూ కరోనా టీకాను తీసుకోవడం లేదు. అందుకే దీని ప్రభావంపైనా, దీన్ని తీసుకోవడం సురక్షితమేనా అన్న అనుమానం కలుగుతోంది‘ అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వ్యాఖ్యానించారు.



    అయితే దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ’ప్రజలను అభద్రతా భావానికి గురి చేయడం, పుకార్లను వ్యాప్తి చేయడం పైనే కాంగ్రెస్ పార్టీ, మనీష్ తివారీ ఎక్కువగా పనిచేస్తున్నారు. దేశంలోని ప్రముఖ వైద్యులు, పారిశుధ్య కార్మికులు కరోనా టీకాను తీసుకుని సోషల్ మీడియాలో ఆనందంగా ఫొటోలను పెడుతున్నారు. మనీష్ జీ.. కాస్త కళ్లు తెరిచి వాటిని చూడండి. కరోనా టీకా అభివృద్ధికి మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. మెరుపు వేగంతో పనిచేశారు. టీకా అభివృద్ధిలో అన్ని నియమ నిబంధనలను పాటించారు. భద్రతే అన్నింటికంటే ముఖ్యమన్న సూత్రాన్ని మరవలేదు. అనవసరంగా పుకార్లను సృష్టించి, ప్రజలను అయోమయానికి గురిచేయవద్దు‘ అంటూ మనీష్ తివారీకి కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ఘాటు వ్యాఖ్యలతో బదులిచ్చారు. అంతకుముందు కూడా కరోనా వ్యాక్సినేషన్ గురించి వస్తున్న పలు పుకార్లకు కేంద్ర మంత్రి ట్వీట్ల రూపంలోనే బదులిచ్చారు. టీకాను తీసుకున్న వారికి స్వల్పంగా జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పులు మాత్రమే ఉంటాయనీ, దీనికి పెద్దగా భయపడొద్దని ఆయన ఓ ట్వీట్ లో స్పష్టం చేశారు.
    Published by:Hasaan Kandula
    First published:January 16, 2021, 20:14 IST