2020 నుంచి ఇప్పటి వరకు జ్వరం తగ్గేందుకు వాడే Dolo ట్యాబ్లెట్లు 350 కోట్లకు పైగా అమ్ముడైనట్టు డేటా చెబుతోంది. జలుబు, జ్వరం ఉంటే సాధారణంగా పారాసిటామల్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు.
కొవిడ్-19(Covid 19) అనారోగ్య సమయంలో మీరు Dolo 650 మాత్ర తీసుకున్నారా? మీరే కాదు, అనేక మంది ఆ ట్యాబ్లెట్(Tablet) వాడే ఉంటారు. కొవిడ్-19 భారతదేశంలో ప్రబలిన 2020 నుంచి ఇప్పటి వరకు జ్వరం తగ్గేందుకు వాడే Dolo ట్యాబ్లెట్లు 350 కోట్లకు పైగా అమ్ముడైనట్టు డేటా చెబుతోంది. జలుబు, జ్వరం ఉంటే సాధారణంగా పారాసిటామల్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అయితే కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాల్లో Dolo అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఈ 350 కోట్ల మాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఎంత ఎత్తవుతుందో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద పర్వతం ఎవరెస్టు శిఖరం(Everest) కంటే 6,000 రెట్లు అది పొడవుగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫా భవనంతో పోల్చితే ఈ మాత్రలు 63,000 రెట్లు పొడవుగా ఉంటాయి. అందరు విరివిగా వాడే Crocin ట్యాబ్లెట్‌తో పోలిస్తే డోలో(Dolo) మాత్రలు 1.5 సెం.మీ పొడవు ఎక్కువగా ఉంటాయి.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న జ్వరం మాత్రల్లో GSKకి చెందిన Calpol మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో డోలో ఉంది. Crocin మాత్ర ఆరో స్థానంలో ఉంది. రీసెర్చ్ సంస్థ IQVIA డేటా ప్రకారం 2019లో కొవిడ్-19కు ముందు భారతదేశంలో 7.5 కోట్ల స్ట్రిప్పుల Dolo ట్యాబ్లెట్ల విక్రయం జరిగింది. 15 మాత్రలు ఉండే Dolo స్ట్రిప్ అమ్మకాలు 2020లో 9.4 కోట్ల అంటే 141 కోట్లు ట్యాబ్లెట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య నవంబర్ 2021 నాటికి 14.5 కోట్ల స్ట్రిప్పులకు పెరిగింది. 2019తో పోలిస్తే ఇవి రెట్టింపు అమ్మకాలు. ఈ స్ట్రిప్పులు లెక్కిస్తే 217 కోట్ల మాత్రలవుతాయి.
జ్వరం, నొప్పులకు నేడు అత్యంత విరివిగా ఉపయోగిస్తున్న రెండో ట్యాబ్లెట్ Dolo. 2021లో దీని టర్నోవర్ రూ.307 కోట్లు. రూ.310 కోట్ల టర్నోవర్‌తో అగ్రస్థానంలో GSKకి చెందిన Calpol ఉంది. ఈ శ్రేణిలో రూ.23.6 కోట్ల టర్నోవర్‌తో ఆరోస్థానంలో Crocin ఉంది. మొత్తంగా చూస్తే 2019లో అంటే కొవిడ్‌కు ముందు అన్ని రకాల Paracetamol బ్రాండ్ల అమ్మకాలు రూ.530 కోట్లు ఉండగా, 2021లో ఇవి ఏకంగా 70% పెరిగి రూ.924 కోట్లకు చేరాయి. జనాలు Doloను కొనడం మాత్రమే కాదు, దాన్ని గూగూల్ చేస్తున్నారు. కొవిడ్-19 ప్రబలిన జనవరి 2020 నుంచి గూగుల్‌లో 2 లక్షల సెర్చ్ రిజల్ట్స్‌లో Dolo 650 ఉంది. Calpol 650- 40,000 సార్లు కనిపించింది. జ్వరం, నొప్పులను తగ్గించే Paracetamol 1960 నుంచి మార్కెట్లో ఉంది. Crocin, Dolo, Calpol పేరుతో వేర్వేరు కంపెనీలు ఈ Paracetamol మాత్రలను విక్రయిస్తున్నాయి.
JEE Main 2022: జేఈఈ మెయిన్ మ్యాథ్స్‌లో ఫుల్ మార్క్స్ మీ టార్గెటా..? సక్సెస్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే..
ఎందుకు Dolo ఇంత పాపులర్ అయింది?
డోలో ట్యాబ్లెట్ పాపులారిటీకి ప్రధాన కారణం దీనికి ఉన్న పొట్టి పేరు. డాక్టర్లు, బ్రాండ్ నిపుణులు, పరిశ్రమ దిగ్గజాలు ఈ విషయాన్ని అంగీకరిస్తారు. అంతే కాదు మిగిలిన బ్రాండ్లు Pyrigesic, Pacimol, Fepanil, Paracip వంటి బ్రాండ్లతో పోల్చితే Dolo ఎంతో సింపుల్‌గా ఉంటుంది. మరో కారణం ఇది 650 MG శ్రేణిలో ఉండటం. తెలియని కారణాలతో వచ్చే జ్వరాలను తగ్గించడంలో ఇది అత్యంత ప్రభావకారి.
బెంగళూరుకు చెందిన Micro Labs 1973లో Dolo రూపొందించింది. మార్కెట్లో 500 MG ట్యాబ్లెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆ అవకాశాన్ని గుర్తించి 650 MG Paracetamolతో విడుదల చేసింది. Dolo-650గా ఇది బాగా పాపులర్ అయింది. 500 Mg ట్యాబ్లెట్‌తో పోల్చితే 650 Mg మాత్రం మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని ఉన్న క్లినికల్ ఎవిడెన్స్‌ను ఈ కంపెనీ క్యాష్ చేసుకుంది. సాధారణ జ్వరం, తీవ్ర జ్వరం మధ్యన ఉన్న ఖాళీని తమ కంపెనీ గుర్తించిందని మైక్రో ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సురానా, The CEO మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు. Paracetamol శ్రేణిలో విడుదలైన మొదటి బ్రాండ్ Crocin. Crookes Interfran సంస్థకు చెందిన సేల్స్ హెడ్ దివంగత GM Masurkar, Crocin విజయం వెనుక ఉన్నారు. ఆ కంపెనీ తర్వాతి కాలంలో Duphar Interfran గా ఆ తర్వాత Solvay గా మారింది.
1990 చివల్లో ఆ కంపెనీ తమ పాపులర్ మాత్ర Crocinను Smithkline Beecham Pharmaceuticals కు విక్రయించింది. ఆ తర్వాత ఆ సంస్థ Glaxo Wellcomeలో విలీనమై ఇప్పుడు GSK (Glaxo Smithkline)గా ప్రసిద్ధి చెందింది. Glaxo సంస్థ దగ్గర Calpol బ్రాండ్ ఉంది. Crocinతో పోల్చితే అది బలహీనమైన బ్రాండ్. Crocin మాత్ర OTC బ్రాండుగా ఉంటే Calpol మాత్రం ప్రిస్క్రిప్షన్ బ్రాండ్‌గా ఉంది.
ఏదైనా ఔషధం OTCగా మారితే వాటిని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయరు. OTC అంటే ఓవర్ ది కౌంటర్ అంటే ఆ మాత్రలు కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు. ఆ డాక్టరు దగ్గరకు వెళ్తే Crocin ట్యాబ్లెట్ రాస్తారు, దాని కోసం ఆయన దగ్గరకు ఎందుకు వెళ్లడం ఫీజు దండగ అనే భావన రోగుల్లో స్థిరపడిపోవడంతో Crocin ప్రిస్ర్కైబ్ చేయడం డాక్టర్లు మానుకున్నారు. ఆ స్థానంలో Dolo 650కి ప్రాధాన్యం ఇవ్వసాగారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.