హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Garlic Health Benefits: ఉదయాన్నే వెల్లుల్లి తింటే... ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

Garlic Health Benefits: ఉదయాన్నే వెల్లుల్లి తింటే... ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

Garlic Health Benefits: మార్నింగ్ పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో అన్నింటికంటే ముందు వెల్లుల్లి తినాలి. అందువల్ల నమ్మశక్యం కాని చాలా లాభాలుంటాయి. అవేంటంటే...

  వెల్లుల్లి వాసన డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. వెల్లుల్లిలో ఉండే చిన్న చిన్న పాయల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, సూక్షక్రిములను చంపేసే యాంటీమైక్రోబయల్, విషవ్యర్థాలను బయటకుపంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఉదయాన్నే ఏమీ తినకుండా ముందుగా వెల్లుల్లిని తింటే... బాడీ మెటబాలిజం (అన్నివ్యవస్థలూ సక్రమంగా పనిచెయ్యడం) బాగుంటుందనీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయనీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్‌ని నివారించవచ్చని పరిశోధనలో తేలింది. ఈ చిన్న చిన్న పాయలే... మన శరీరానికి ఆయుధాల్లా మారి... గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్, ఇన్ఫెక్షన్ల నుంచీ కాపాడతాయి. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఉదయాన్నే వెల్లుల్లి తింటే మూడు ప్రయోజనాలు కలుగుతాయి.

  డయాబెటిస్ కంట్రోల్ : ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ పెరుగుతోంది. కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే. మనం తినే ఆహారం... మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే నెలన్నరలోనే టైప్-2 డయాబెటిస్ సమస్యల నుంచీ గట్టెక్కవచ్చు. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

  Eat Garlic Every Morning with Empty Stomach and Reap these 3 Benefits nk
  వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  చురుగ్గా మారే బ్రెయిన్ : మన బాడీలో బ్రెయిన్ ఎంతో కీలకం. దానికి ఆక్సిజన్ ద్వారా విషపూరిత పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్‌ని క్లీన్ చెయ్యాలంటే వెల్లుల్లి తినాలి. ఇవి మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తాయి. అంతేకాదు... పని ప్రదేశంలో మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. కొత్తకొత్త ఐడియాలు ప్రవాహంలా వస్తాయి.

  Eat Garlic Every Morning with Empty Stomach and Reap these 3 Benefits nk
  వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  అధిక బరువుకి చెక్ : ఉదయాన్నే వెల్లుల్లి పాయలు తింటే... అవి లోపలికి వెళ్లి... సూపర్ ఫుడ్‌లాగా పనిచేస్తాయి. ఎక్కడెక్కడ అదనపు కొవ్వు ఉందో చూసి... దాన్ని కరిగించేస్తాయి. అత్యంత త్వరగా మెటబాలిజంని సెట్ చేస్తాయి. ఆరోగ్యం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. అందువల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. శరీరంలోకి చెడు పదార్థాలు, విషవ్యర్థాలు రాకుండా ఉంటాయి.

  Eat Garlic Every Morning with Empty Stomach and Reap these 3 Benefits nk
  వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

  రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...

  కాబట్టి... నిద్రలేవగానే... ఓ నాలుగైదు వెల్లుల్లి పాయల రెబ్బల్ని కరకరా నమిలి తినేయండి. అవి చేదుగా అనిపించినా పట్టించుకోకండి... నాల్రోజులు అలా తింటే... ఆ తర్వాత అవే అలవాటైపోతాయి. ఇలా చేయడం వల్ల బ్రహ్మాండమైన ఆరోగ్యం మన సొంతమవుతుందంటున్నారు డాక్టర్లు.

  First published:

  ఉత్తమ కథలు