Home /News /national /

HCL TECH REVOKES ONE CONTENTIOUS BONUS RECOVERY POLICY EX EMPLOYEES MULL LEGAL ACTION AGAINST COMPANY GH SK

HCL: ఇచ్చిన బోనస్‌ను మళ్లీ వెనక్కి తీసుకుంటారా? హెచ్​​సీఎల్ బోనస్ రికవరీ పాలసీపై దుమారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HCL Technologies: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్​సీఎల్ టెక్నాలజీస్(హెచ్​సీఎల్​) ​బోనస్ రికవరీ పాలసీ వివాదస్పమైంది. సంస్థ ఇటీవలే ప్రకటించిన ఎంగేజ్‌మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్​ను(ఈపీబీ) తిరిగి చెల్లించాల్సిందిగా తమ ఉద్యోగులను కోరింది. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్ర కార్మిక శాఖను(Union Labour Ministry) ఆశ్రయించింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్​సీఎల్ టెక్నాలజీస్(హెచ్​సీఎల్​) (HCL Technologies) ​బోనస్ రికవరీ పాలసీ వివాదస్పమైంది. సంస్థ ఇటీవలే ప్రకటించిన ఎంగేజ్‌మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్​ను(ఈపీబీ) తిరిగి చెల్లించాల్సిందిగా తమ ఉద్యోగులను కోరింది. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగుల సంఘంకేంద్ర కార్మిక శాఖను(Union Labour Ministry) ఆశ్రయించింది.

వాహనదారులకు అలర్ట్.. ఇక అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగ్ లు.. కేంద్రం కీలక నిర్ణయం

వివాదానికి కారణమేంటి?

ఉద్యోగంలో చేరే సమయంలో ఇచ్చే ఆఫర్ లెటర్‌లో ఎంగేజ్‌మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్​ను(ఈపీబీ) తిరిగి క్లెయిమ్ చేసే పదాన్ని హెచ్​సీఎల్ చేర్చకపోవడంతో వివాదం మొదలైంది. ఈ విధానాన్ని అమలు చేసిన తరువాత అంటే దాదాపు 7 నెలల తర్వాత.. కంపెనీ తన ఉద్యోగులందరికిదీనికి సంబంధించన వివరాలను ఈ–మెయిల్‌ చేసింది. ఒకవేళ ఒక ఉద్యోగి ఆర్థిక సంవత్సరం పూర్తికాకముందే రాజీనామా చేస్తే, ఎంగేజ్‌మెంట్ పనితీరు బోనస్‌ను తిరిగి చెల్లించవలసి ఉంటుందనేది దాని సారాంశం. ఈ క్రమంలో 2021 ఏప్రిల్ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగుల నుంచి ఈ రికవరీ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది హెచ్​సీఎల్.

అయితే ఈ విషయాన్ని సదరు ఉద్యోగలకు తెలియజేయకుండా HCL పాలసీ హబ్‌లో పోస్ట్ చేస్తూ వస్తోంది. రాజీనామా సమయంలో క్లెయిమ్‌లు, ఇతర పరిష్కారాల కోసం కంపెనీకి 'సెపరేషన్ పోర్టల్'(Separation Portal) ఉంది. దీనిలోనే రాజీనామా చేసిన ఉద్యోగుల నుంచి EPBని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై పెద్ద సంఖ్యలో ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందగా.. దాదాపు 7 నెలల తర్వాత అంటే 2021 నవంబర్​లో పంపిన ఓ ఈమెయిల్ ద్వారా EPB రికవరీ పాలసీ గురించి తెలియజేసింది. చాలా మంది ఉద్యోగులు(HCL employees) రికవరీ పాలసీకి సంబంధించి కంపెనీ అడుగుతున్న మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించారు. దీనిపై గుర్రుగా ఉన్న హెచ్​సీఎల్.. ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌, రిలీవింగ్‌ లెటర్‌, ఇతర డాక్యుమెంట్స్​ను రాజీనామా చేసిన వారికి ఇవ్వడానికి నిరాకరించింది.

పండుగ పూట రైల్వే ప్రయాణికులకు శుభవార్త..ఏపీ, తెలంగాణ మధ్య మరో 8  ప్రత్యేక రైళ్లు

హెచ్సీఎల్ ఏమంటోంది..?

ఈ వివాదంపై స్పందించిన హెచ్​సీఎల్.. తమ ఉద్యోగులకు తెలియకుండా తాము ఏ నిర్ణయాన్ని చేపట్టడం లేదని హెచ్​సీఎల్​ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగానికి రాజీనామా చేసిన వారి నుండే అడ్వాన్స్‌డ్ మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్​ను (AMPB) తిరిగి పొందే విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉందని.. కాబట్టి ఎంగేజ్మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ను(EPB) తిరిగి క్లెయిమ్ చేసే విధానం సైతం ప్రస్తుత పాలసీకి భిన్నమైనదేమీ కాదని హెచ్​సీఎల్ వాదిస్తోంది.

పీఎంఓకు లేఖ..

రికవరీ పాలసీ పేరుతో తాము వేరే చోట ఉపాధి పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వకుండా హెచ్​సీఎల్ తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ.. పుణేకు చెందిన ఐటీ యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ శ్రీ హర్‌ప్రీత్ సలూజా ప్రధాని కార్యాలయం(PMO) సహా.. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశారు. ఇప్పటికే చెల్లించిన బోనస్‌ను రికవరీ చేసే విధానం అన్యాయమని అందులో పేర్కొన్నారు.

UPI PIN: యూపీఐ పిన్‌తో మోసాలు... జాగ్రతగా ఉండకపోతే అకౌంట్ ఖాళీ

అంతేగాక ఈ పాలసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని తెలిపారు. కరోనా కాలంలో అందుకున్న బోనస్ మొత్తాన్ని వాపసు చేయడం వల్ల ఉద్యోగిపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కార్మిక శాఖ.. సంబంధిత విభాగానికి లేఖను పంపింది. అంతేగాక హెచ్​సీఎల్ టెక్నాలజీస్ నుంచి వివరణ కోరింది. మరోవైపు.. HCL తన 2021 ఏప్రిల్ నాటి EPB పాలసీ రికవరీ విధానాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఈమెయిల్‌లు ఉద్యోగులకు రాకపోవడం గమనార్హం.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు