హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Opinion: 5 ఎకరాల భూమి ముస్లింలను సంతోషపరుస్తుందనే భ్రమ లేదు..

Opinion: 5 ఎకరాల భూమి ముస్లింలను సంతోషపరుస్తుందనే భ్రమ లేదు..

న్యూస్18 క్రియేటివ్

న్యూస్18 క్రియేటివ్

దశాబ్దాల నాటి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్సర్ అహ్మద్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

వ్యాసకర్త : అఫ్సర్ అహ్మద్

దశాబ్దాల నాటి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ వివాదాస్పద సమస్యను పరిష్కరించిందా? సాంకేతికంగా చెప్పాలంటే, సమాధానం సానుకూలంగా ఉండవచ్చు. కానీ మానసికంగా కాదు. ఈ విషయం చెప్పడానికి కారణం ఉంది. వాస్తవానికి, ముస్లిం సమాజం దీనిని తమ ‘విధి’గా తీసుకోవటానికి రాజీ పడింది. కాని వారి హృదయాలు గాయాలయ్యాయి. అలా ఎందుకు అనే ప్రశ్న అడగవచ్చు. అందుకు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.

ఈ తీర్పు ఊహించిందే..

కొన్ని కారణాల వల్ల తీర్పు ఈ విధంగా ఉంటుందని ముస్లిం సమాజానికి తెలుసు. అలాగే జరిగింది కూడా. కానీ, ఎందుకు వారు ఈ నిర్ణయానికి వచ్చారు? ఏ అంశం వారిని ఈ నిర్ణయానికి వచ్చేలా చేసింది? ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదాన్ని ముస్లింలు నమ్మగలిగేలా ప్రభుత్వం చేయలేకపోయింది.

మైనారిటీల మీద ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. లేకపోతే మూకదాడుల మీద చట్టం తీసుకొచ్చేదే కదా. కానీ, అది జరగలేదు. అలాగని మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఏమీ చేయలేదని కాదు. మైనారిటీల పరిస్థితి మెరుగుపరచడానికి తెచ్చిన కొన్ని పథకాలు కచ్చితంగా ప్రశంసింపతగినవే. కొన్ని పథకాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ, కొందరు మంత్రులు, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అన్నీ నాశనం చేశాయనేది చేదు నిజం.

దీనివల్ల మైనారిటీలు, ప్రభుత్వం మధ్య అంతరం పెరిగింది. అయోధ్యపై సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, ముస్లింలు న్యాయం జరగలేదని భావిస్తున్నారు. ఇది నమ్మక లోపం తప్ప మరొకటి కాదు. కానీ ప్రభుత్వం లేదా కోర్టు దీనిని తొలగించడానికి ప్రయత్నించలేదు. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి కానీ ప్రభుత్వాలను నడపవు. కాబట్టి, అది వారి బాధ్యత కూడా కాదు.

మంచి ప్రక్షాళన!

మీడియా ప్రకారం, ఈ సమస్య ఇప్పుడు మన వెనుక ఉందని అందరూ చెబుతున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ తీర్పుతో మైనారిటీలు నిరాశ చెందుతున్నారు. కాని దేశం ఈ వివాదం నుంచి బయటపడిందనే వాస్తవాన్ని వారు రాజీ చేసుకున్నారు. దశాబ్దాలుగా సాగిన ఆత్మగౌరవ పోరాటం ఇప్పుడు అంతమైంది.

నిరాశ, శాంతి విరుద్ధమైన పదాలు. కాని అవి ముస్లిం సమాజం యొక్క మానసిక స్థితిని సముచితంగా ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే వారు తొక్కివేయబడ్డామనే భావనలో ఉన్నారు. 1992లో మసీదును ధ్వంసం చేసిన వారి వాదనకు సమ్మతి లభించింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ, తీర్పు మాత్రం వారికి అనుకూలంగా ఇచ్చింది.

మరోవైపు, ముస్లిం సమాజం ఉపశమనం పొందుతుంది. అందుకే ఈ తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎక్కడా నిరసన జరగలేదు. దీనికి కారణం ప్రభుత్వం, మత సంస్థలు విజ్ఞప్తులు చేసినందువల్ల కాదు. కానీ ఈ వివాదం తమకు శాపం కన్నా తక్కువ కాదని ముస్లిం సమాజం భావించింది. అయోధ్య భూ వివాదంపై వారిపై అనేక అల్లర్లు జరిగాయి. చాలా ఇళ్ళు తగలబెట్టబడ్డాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయినప్పటికీ, వారిని మీడియా విలన్ లాగా చూసింది.

హిందు, ముస్లింల మధ్య విభజన తెచ్చిన అంశానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఇప్పుడు వారి పిల్లలు ఎటువంటి భయాలు లేకుండా వారి పాఠశాలకు వెళ్ళవచ్చు. ఇప్పుడు వారు దేనికీ భయపడకుండా పనికి వెళతారు. ఎంత విధ్వంసం జరగాలో.. అంతా 1992లోనే జరిగింది. ఇక మిగిలింది ఓ ఫార్మాలిటీ మాత్రమే.

సమస్య పరిష్కారం అయిందా?

ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది చాలా బాధ కలిగించే భాగమని నేను అనుకుంటున్నా. వాస్తవానికి, ఇంకా ముగియలేదు. ముస్లిం సమాజంలోని విద్యావంతులైన వర్గం, దీనిపై సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే వారు స్పందించే విధానంలో గణనీయమైన మార్పు ఉంది. అంతకుముందు పేద ముస్లింల నుంచి స్పందన వచ్చేది. చదువుకున్న మధ్యతరగతి ముస్లింలు నోరు తెరిచేవారు కాదు. అది ఇప్పుడు మారిపోయింది. ఈసారి విద్యావంతులైన మధ్యతరగతి వారు ఈ నిర్ణయంతో రాజీపడలేరు. ఇదో కొత్త పరిణామం.

ఉదాహరణకు, సోషల్ మీడియాలో తీర్పుపై బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిలో తస్లీమ్ రెహ్మానీ, రానా అయూబ్ వంటి వారు ఉన్నారు. మౌల్వీలు పిలుపునివ్వగానే మౌనంగా ఉండిపోయే దిగువ మధ్యతరగతి వ్యక్తులు కాదు వారు. జరిగినదానిపై వారు సంతోషంగా లేదు. 1992లో పెద్దగా నోరెత్తని మధ్యతరగతి ఇప్పుడు గట్టిగా తమ వాదనను ఎందుకు వినిపిస్తుంది. దీంట్లో పరిశీలించాల్సిన అంశం ఏంటంటే.. ఇది 1992 నాటి భారత్ కాదు. 1992 నాటి ముస్లింలు కూడా కారు.

సుప్రీంకోర్టు సూచించిన ఐదు ఎకరాల భూమిని అంగీకరించకూడదని ముస్లిం సమాజం భావిస్తోంది. ఈ నిర్ణయం ఏదో తమను సంతృప్తి పరచడానికి చేసినట్టుగా ఉందని వారు భావిస్తున్నారు. ఈ భూమిని అంగీకరిస్తే, బాబ్రీ మసీదుపై ముస్లింలు చేసిన వాదన తప్పు అని రుజువు అవుతుంది. దీంతోపాటు షరియత్ ప్రకారం.. ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమిని తీసుకోవడంలో అర్థం లేదు. ఐదు ఎకరాల భూమిని నిరాకరించడం ద్వారా సమాజం తమ వ్యతిరేకతను వ్యక్తం చేయాలనే అంశంపై చాలా మంది ముస్లింలు కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దావా 5 ఎకరాల భూమి గురించి కాదు. అది బాబ్రీ మసీదు భూమిపై హక్కు కోసం వేసిన దావా. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మిగిలిపోయింది.

మోదీ, రాహుల్, గొగోయ్… అందరూ ఒక రోజు వెళ్లిపోతారు. కాని భారతదేశం అలాగే ఉంటుంది. కొత్త తరం వస్తుంది. భారతదేశం పునర్జన్మను పొందుతుంది. తీర్పు ఇచ్చినప్పటికీ, సుదీర్ఘమైన, లోతైన దుర్మార్గం ఇంకా ముగియలేదని నేను భావిస్తున్నా. ఇది మిగిలి ఉన్న అతిపెద్ద పని.

కాశీ, మధురలతో దీనికి సంబంధం లేదని చెప్పడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత జాగ్రత్తగా అడుగులు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం తన వంతు కృషి చేయాలి. ఒక భూమి దేశాన్ని సృష్టించదని, మనుషులు దేశాన్ని సృష్టిస్తారని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రజలందరినీ కలుపుకొని వెళ్లడం సమిష్టి బాధ్యత. అది ప్రభుత్వం భుజంపై ఉంది.

బాబ్రీ మసీదు తరఫున న్యాయపోరాటం చేసిన హషీమ్ అన్సారీ ఓ మాట అన్నారు. తాను న్యాయ పోరాటంలో గెలిచినా, తన హిందూ సోదరుల హృదయాలను గెలుచుకునే వరకు మసీదు నిర్మాణం ప్రారంభించబోమని అన్నారు. భారత ప్రజలకు ఇక్కడ ఒక సందేశం ఉంది. విజయం లేదా ఓటమి, ప్రజలను వెంట తీసుకెళ్లండి.. ఈ పిలుపుపై ​​ఎవరైనా శ్రద్ధ చూపుతున్నారా?

First published:

Tags: Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict, Babri masjid, Supreme Court

ఉత్తమ కథలు