Home /News /national /

Hathras Case: హత్రాస్ కేసులో యోగి సర్కార్‌కు అమిత్ షా బాసట

Hathras Case: హత్రాస్ కేసులో యోగి సర్కార్‌కు అమిత్ షా బాసట

రాహుల్ జోషితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ

రాహుల్ జోషితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ

Amit Shah To News18 - Exclusive Interview: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. హత్రాస్ కేసును స్థానిక పోలీస్ స్టేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి ...
    Amit Shah To News18 - Exclusive Interview: దేశ వ్యాప్తంగా దుమారంరేపిన హత్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. హత్రాస్ కేసును స్థానిక పోలీస్ స్టేషన్ మిస్ హ్యాండిల్ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై సిట్ విచారణకు ఆదేశించడం ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కితాబిచ్చారు.  ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతి గ్యాంగ్ రేప్, హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. యూపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు విఫలం చెందిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ అంశంపై అమిత్ షా స్పందించారు. దేశంలో పోలీస్ సంస్కరణల అవసరాన్ని తోసిపుచ్చలేమని అమిత్ షా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

    అదే సమయంలో అత్యాచార ఘటనపై రాజకీయాలు చేయడం సరిగాదని అమిత్ షా మండిపడ్డారు. యూపీలోని హత్రాస్‌లోనూ...రాజస్థాన్‌లోనూ ఒకే సమయంలో అత్యాచార ఘటనలు జరిగాయన్నారు. అయితే హత్రాస్ ఘటనపై మాత్రమే చర్చ జరగడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి అత్యంత కిరాతక ఘటనపై రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సంఘట జరిగిన రోజే హత్రాస్ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారని..ఇప్పుడు వారు జైల్లో ఉన్నారని అన్నారు.

    hathras gangrape news, hathras rape case, hathras case news, amit shah hathras case, yogi adithyanath, uttarpradesh, rahul joshi amit shah interview, అమిత్ షా, హత్రాస్ గ్యాంగ్ రేప్, యోగి ఆదిత్యనాథ్
    కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా


    హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహానికి పోలీసులు రాత్రికి రాత్రి దహనం చేయడంపై స్పందించిన అమిత్ షా...దీనిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పటికే  కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారని...ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం జరిందని గుర్తుచేశారు. ఇలాంటి సున్నితమైన ఘటనపై ఎవరూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ కేసులో యూపీలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని స్పష్టంచేశారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో కింది స్థాయి పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయాల వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. సిట్ దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దర్యాప్తులో ఎవరు తప్పు చేశారో తేలుతుందని...దాని ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Amit Shah

    తదుపరి వార్తలు