హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ప్రధాని మోదీ జన్మదినం.. తలసేమియా రోగులకు తీపికబురు అందించిన రాష్ట్రం..

ప్రధాని మోదీ జన్మదినం.. తలసేమియా రోగులకు తీపికబురు అందించిన రాష్ట్రం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: తలసేమియా రోగులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచింది. ఇక నుంచి ప్రతినెల డబ్బులు ఇవ్వడంతో పాటు, ఉచితంగా కొన్ని సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

హర్యానా (Haryana) ప్రభుత్వం తలసేమియాతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా ఈ వ్యాధి సోకిన వారికి ఖరీదైన వైద్యం, మందులు అవసరమౌతుంటాయి. రోగులకు తరచుగా డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పేదలకు తమ వంతుగా రోగులకు భరోసా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి తలసేమియా వ్యాధిగ్రస్తులకు.. నెలకు రూ. 2500 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వీరికి వీరికి ఉచిత వైద్య పరీక్షలు కూడా చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఖట్టర్ ప్రకటించారు. తలసేమియా అనేది వంశపారంపర్య రక్త రుగ్మత. దీని కారణంగా ఒక వ్యక్తి యొక్క శరీరం తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయదు. ఇది తక్కువ ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలకు దారితీస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురుగ్రామ్‌లో సమరస్ హిందూ మంచ్ నిర్వహించిన రక్తదాన శిబిరం సందర్భంగా రోగులను ఉద్దేశించి సీఎం ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. ఖట్టర్ తలసేమియాతో బాధపడుతున్న 125 మంది పిల్లలకు కార్డులను పంపిణీ చేశారు. దీని ద్వారా వారు MRI వంటి ఇతర పరీక్షలతో పాటు వారి రక్త పరీక్షలను కూడా చేయవచ్చు.

తలసేమియా అనేది తీవ్రమైన వ్యాధి అని, ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని కొంత కాలం తర్వాత మార్చవలసి ఉంటుందని, దాని చికిత్స ఖరీదైనదని ఆయన అన్నారు. పేదలకు వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం అమలులోకి వచ్చిందని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకం అని ముఖ్యమంత్రి ఖట్టర్ తెలిపారు.

ఇదిలాా ఉండగా  కేరళలో (kerala) ఒక ఘటన వివాదస్పదంగా మారింది.

తిరువనంతపురం దగ్గర కాలేజీ స్టూడెంట్స్ వేచి ఉండే బస్టాండ్ లో యువతి, యువకులు కూర్చోవడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. చాలా సార్లు.. అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే సీటుపై కూర్చుంటు ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించారు. దీంతో ఇది గమనించిన స్థానికులు ఈ రకంగా ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులు దీనిపై తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ ఘటన తిరువనంతపురంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్-త్రివేండ్రం (సిఇటి) సమీపంలోని శ్రీకార్యం వద్ద అదే స్థలంలో జరిగింది. అయితే.. ఇక్కడ స్థానిక మేయర్.. ఆర్య ఎస్ రాజేంద్రన్ జెండర్ న్యూట్రల్ బస్టాండ్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చిన రెండు నెలల తర్వాత పౌర అధికారులు దానిని తొలగించారు. దీనిపై మేయర్ స్పందించారు. బెంచ్‌ను మూడుగా విభజించడం అనుచితమైనదన్నారు. కేరళ లాంటి ప్రగతిశీల సమాజానికి అననుకూలమైనదని కూడా అన్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Haryana

ఉత్తమ కథలు