Home /News /national /

HARYANA MOTHERS WORRY AFTER DAUGHTER SCORES 100 PERCENT IN CLASS 10 GEOS VIRAL PAH

టెన్త్ లో 100 శాతం మార్కులు స్కోర్ చేసిన కూతురు.. టెన్షన్ లో తల్లి.. ఎందుకో తెలుసా..?

మనోహర్ లాల్ ఖట్టర్ (ఫైల్)

మనోహర్ లాల్ ఖట్టర్ (ఫైల్)

Haryana: బాలిక తాజాగా, విడుదల చేసిన సీబీఎస్ఈ బోర్డు రిజల్ట్ లో నూరుశాతం మార్కులు స్కోర్ చేసింది. దీంతో అప్పటి నుంచి తల్లికి ఒకటే టెన్షన్ పట్టుకుంది.

తల్లిదండ్రులు తమ బిడ్డలు సరిగ్గా చదవాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఫలితాల్లో తమ పిల్లలు పాస్ కాకుంటే, మార్కులు సరిగ్గా రాకుంటే తీవ్రమైన ఒత్తిడికి గురౌతుంటారు. అయితే... ఇక్కడోక కన్న తల్లి దీనికి భిన్నంగా ప్రవర్తించింది.ఆమె కూతురు వందశాతం మార్కులు సాధించడం పట్ల సంతోషాంగా ఉండటానికి బదులు, టెన్షన్ గా ఫీలయ్యింది.

పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) వింత ఘటన జరిగింది. మహేందర్ గఢ్ లోని డోంగ్రా అనే గ్రామంలో అంజలి అనే బాలిక తన కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆమె తల్లి ఊర్మిళ. వీరికి కొద్దిపాటి మాత్రమే పొలం ఉంది. దీనిలో కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంది. అయితే, తాజాగా, సీబీఎస్ఈ బోర్డు రిజల్ట్ లో బాలిక వంద శాతం మార్కులు సాధించింది. దీంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు. కానీ బాలిక తల్లి మాత్రం ఒత్తిడికి గురైంది. తన కూతురుకి పై చదువుల కోసం డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక టెన్షన్ కు గురైంది. అలాంటి సమయంలో ఒక అనుకొని సంఘటన జరిగింది.



ఆమెకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar)  నుంచి కాల్ వచ్చింది. ఆమెకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఆమె తన ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిపింది. ఈ క్రమంలో ఆయన.. నెలకు 20 వేల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అంజలి తాను.. కష్టపడి డాక్టర్ అవుతానని చెప్పింది. అయితే, అంజలి తండ్రి సైన్యంలో పనిచేసేవాడు. అతనికి యుద్దంలో ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇప్పటికే, ఈపీఎఫ్ఓ నుంచి అతను సాధారణ భవిష్య నిధి నుండి సుమారు ₹ 10 లక్షలు అందుకున్నప్పటికీ, కుటుంబం తమ ఆర్థిక నిర్వహణను నిర్వహించలేకపోయిందని ఊర్మిళ చెప్పింది. అంజలి తమ్ముడు ఐదో తరగతి చదువుతున్నాడు. కొద్దిపాటి ఆర్థికసాయంతో నిర్వహించడం చాలా కష్టంగా ఉందని, అందుకే మా పరిస్థితి గురించి ముఖ్యమంత్రి సాహబ్‌తో మాట్లాడానని ఆమె చెప్పారు. అదే విధంగా.. స్కాలర్‌షిప్‌ను ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి బాలిక కుటుంబం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Cbse results, Haryana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు