సెంటిమెంటుతో చెలగాటమా?: సిద్దుపై ఆగని విమర్శలు

సిద్దుకు ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు అయితే కావచ్చునని, దేశం కన్నా స్నేహం అంత గొప్పదేమి కాదని హర్యానా మంత్రి అనిల్ విజ్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: August 19, 2018, 5:07 PM IST
సెంటిమెంటుతో చెలగాటమా?: సిద్దుపై ఆగని విమర్శలు
నవజోత్ సింగ్ సిద్దు(File)
  • Share this:
పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరైన కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దుపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దు దేశద్రోహి అంటూ ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కూడా సిద్దుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దు పాక్ వెళ్లడాన్ని దేశ వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. దేశభక్తి ఉన్న ఏ పౌరులైనా ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకారని అన్నారు.

వాజ్‌పేయి చనిపోయిన బాధలో దేశం ఉంటే సిద్దు పాక్ వెళ్లి ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడమేంటని ఆయన ప్రశ్నించారు. సిద్దు చేసిన పని ఈ దేశ ప్రజల సెంటిమెంటును దెబ్బతీసే విధంగా ఉందన్నారు. కేంద్రం వారం రోజుల సంతాప దినాలు ప్రకటించిన తర్వాత కూడా సిద్దు పాక్ వెళ్లడాన్ని ఆయన తప్పు పట్టారు. సిద్దుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్ సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు. సిద్దుకు ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు అయితే కావచ్చునని, దేశం కన్నా స్నేహం అంత గొప్పదేమి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, ఇమ్రాన్ స్నేహితుడిగా మాత్రమే తాను పాకిస్తాన్ వెళ్లానని, ఒక రాజకీయ నాయకుడిగా అక్కడికి వెళ్లలేదని సిద్దు ఇదివరకే చెప్పారు. అయితే బీజేపీ నేతలు విమర్శలపై మాత్రం సిద్దు ఇంతవరకు స్పందించలేదు. దీంతో విమర్శలకు ఆయన బదులిస్తారా?.. లేక చూసీ చూడనట్టుగానే వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: పీకల్లోతు వివాదంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు!
Published by: Srinivas Mittapalli
First published: August 19, 2018, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading