ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఊరంతా శుభలేఖలు పంచి పెళ్లికి రావాలని ఆహ్వానిస్తారు. ఎంత ఎక్కువ మంది వస్తే తమకు అంత పలుకుబడి ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇక ఆహ్వాన పత్రికల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నలుగురితో పోల్చితే కాస్త విభిన్నంగా ఉండేలా చూసుకుంటారు. శుభలేఖలు మాత్రమే కాదు.. ఈ కాలనానికి తగ్గట్లుగా వీడియోల రూపంలోనూ సందేశాలు పంపిస్తుంటారు. కానీ హర్యానాకు చెందిన ఓ ఫ్యామిలీ మాత్రం పెళ్లి పత్రికలను వెరైటీగా తయారు చేశారు. మా ఇంటి పెళ్లికి అందరూ రావాలి..వధూ వరులను ఆశీర్వదించాలని అందరూ కోరుకుంటారు. కానీ వీరు మాత్రం మా పెళ్లికి కొందరు రావొద్దని ముద్రించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, జేజేపీ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వివాహ వేడుకకు హాజరుకావొద్దని పెళ్లి పత్రికపై ముద్రించారు. ఇప్పుడీ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Porn Link: స్కూల్ టీచర్ పాడు పని.. 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో లింక్..
విశ్వ వీర్ జాట్ మహాసభ (Vishwaveer jat Mahasabha) అధ్యక్షుడు, జై జవాన్ జై కిసాన్ మజ్దూర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజేశ్ ధన్‌కర్ (Rajesh Dhankar) ఇంట్లో వివాహం జరుగుతోంది. డిసెంబరు 1న ఆయన కూతురు వివాహం ఘనంగా జరగనుంది. ఐతే ఆ వివాహ వేడుకకు హాజరుకావాల్సిందిగా ఎందరో ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు పంపించారు. కానీ బీజేపీ, జేజేపీలకు మాత్రం షాకిచ్చారు. తమ కూతురు వివాహానికి బీజేపీ, జేజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలెవరూ హాజరుకాకూడదని పెళ్లి పత్రికపై ముద్రించారు. దీనికి ఓ బలమైన కారణముంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రాజేశ్ ధన్‌కర్ కూడా అదే కోరుతున్నారు. హర్యానాలో ఆయన నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. రైతులు ఇంత చేస్తున్నా కేంద్రం మొండి వైఖరి అవలంభిస్తోందని.. అందుకే తమ కూతురి వివాహానికి బీజేపీ నేతలు రావొద్దని కోరినట్లు ఆయన వివరించారు.
Punjab: ఆ మహిళలకు రూ. 1000.. పంజాబ్‌పై కేజ్రీవాల్ హామీ ఎఫెక్ట్ ఎంత ?
ఐతే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలను తెచ్చామని, కానీ రైతులను ఒప్పించడంలో తాము విఫలమయ్యామని తెలిపారు. ఇన్నాళ్లు రైతులను ఇబ్బంది పెట్టినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు ప్రధాని మోదీ. రైతు చట్టాలను రద్దు చేసినా వివాహ ఆహ్వాన పత్రికలపై ఇలా రాయడమేంటని బీజేపీ కార్యకర్తలు రాజేశ్ ధనకర్‌పై మండిపడుతున్నారు. ఐతే ఇవి మోదీ ప్రసంగానికి ముుందు ముద్రించినవని ఆయన బంధువులు మీడియాకు వివరించారు. మోదీ ప్రకటన చేసినా తాము ఆందోళనలు విరమించేది లేదని, మద్దతు ధరతో పాటు ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాలని చెబుతున్నారు. అలాంటి పెళ్లి పత్రికలను ఇంకా ఆర్డర్ ఇచ్చామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపేందుకే ఇలా చేస్తామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.